దుమ్ము తుఫాన్‌: 19 మంది మృతి, 48 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Jun 7, 2019, 2:29 PM IST
Highlights

: దుమ్ము తుఫాన్ కారణంగా  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  19 మంది మృత్యువాత పడ్డారు.మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి పరిహరం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
 

లక్నో: దుమ్ము తుఫాన్ కారణంగా  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  19 మంది మృత్యువాత పడ్డారు.మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి పరిహరం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

యూపీ రాష్ట్రంలోని మొయిన్‌పురిలో ఆరుగురు,  ఎత్తా, కిషన్‌గంజ్ ప్రాంతాల్లో ముగ్గురు చొప్పున , మోరాదాబాద్‌,  బాదౌన్, పిలిభిత్, మధుర, కన్నౌజ్,  సంభల్, ఘజియాబాద్‌లలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడినట్టుగా అధికారులు ప్రకటించారు.

గురువారం సాయంత్రం యూపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ వచ్చిందని అధికారులు చెప్పారు.ఈ దుమ్ము తుఫాన్ కారణంగా వేళ్లతో సహా చెట్లు కుప్పకూలాయి. మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఇంటి కప్పులు ఎగిరిపడ్డాయని అధికారులు ప్రకటించారు.

దుమ్ము తుఫాన్ కారణంగా మృత్యువాత పడిన కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.  జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయా జిల్లాల ఇంచార్జీ మంత్రులను సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు.దుమ్ము తుఫాన్ కారణంగా 8 గేదేలు కూడ మృత్యువాత పడినట్టుగా అధికారులు ప్రకటించారు.

click me!