అమెరికా చట్టసభ ప్రతినిధులతో ప్రధాని మోడీ భేటీ.. చర్చల టార్గెట్ చైనా?

By telugu teamFirst Published Nov 13, 2021, 3:24 PM IST
Highlights

అమెరికా చట్ట సభ ప్రతినిధులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థిరత్వం, శాంతి కోసం ఈ రిజియన్‌లో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉన్నదని, అందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోడీతోపాటు అమెరికా ప్రతినిధులూ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని భావించారు. ఈ సమావేశం చైనాను టార్గెట్ చేసుకుని జరిగిందా? అనే చర్చ మొదలైంది.

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి Narendra Modi అమెరికా కాంగ్రెస్ సభ్యుల ప్రతినిధుల(Delegation)తో సమావేశమయ్యారు. రీజనల్ సమస్యలపై ఉభయవర్గాల ప్రయోజనాలపై ఫ్రాంక్‌ డిస్కషన్ చేశారు. దక్షిణాసియా, ఇండో పసిఫిక్ రీజియన్ అంశాలపైనా చర్చ జరిపారు. సెనేటర్ జాన్ కొర్నిన్ సారథ్యంలోని సెనేటర్ మైఖేల్ క్రాపో, సెనేటర్ థామస్ టబర్విల్లే, సెనేటర్ మైఖేల్ లీ, కాంగ్రెస్‌మన్ టోనీ గొంజేల్స్, కాంగ్రెస్‌మన్ జాన్ కెల్వినర్ ఎలీజీ సీనియర్‌లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. అయితే, ఈ భేటీ China లక్ష్యంగా సాగిందా? అనే చర్చ కూడా జరుగుతున్నది.

కరోనా సమయంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భిన్న ప్రజలు నివసించే పెద్ద దేశమైనప్పటికీ సమర్థవంగా వ్యవహరించారని America కాంగ్రెషనల్ ప్రతినిధులు మెచ్చుకున్నారు. ప్రజాస్వామిక విలువల ఆధారంగా ప్రజలూ ఈ మహమ్మారి కట్టడికి నడుం బిగించారని, అందుకే ఈ శతాబ్దంలో తీవ్రమైన మహమ్మారి కరోనాను ఎదుర్కోవడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ - అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావడానికి అమెరికా స్థిరంగా మద్దతు ఇస్తున్నదని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని తెలిపారు. అందుకు అమెరికాను ప్రశంసించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది.

Also Read: జీ20 సదస్సు: ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ చిట్‌చాట్..

రీజనల్ అంశాలపై ఉభయ దేశాల ప్రయోజనాలకు సంబంధించి ఫ్రాంక్‌గా చర్చ జరిగినట్టు పీఎంవో వెల్లడించింది. ఇందులో దక్షిణాసియా, ఇండో పసిఫిక్ అంశాలూ ఉన్నట్టు తెలిపింది. ఈ ఉభయ దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల్లో చాలా వరకు సారూప్యత కనిపిస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు అమెరికా చట్ట సభల ప్రతినిధులు పేర్కొన్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థిరత్వానికి, శాంతికి ఈ ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని అందరూ చర్చించుకున్నట్టు వివరించింది. కాగా, టెర్రరిజం, పర్యావరణ మార్పులు, క్రిటికల్ టెక్నాలజీలపై సహకారం వంటి అంతర్జాతీయ అంశాలపైనా మరింత సహకారాలు ఇచ్చి పుచ్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపినట్టు పేర్కొంది.

చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా ఇన్నాళ్లు భారత్‌తో అనుయాయంగా కొనసాగింది. కానీ, తాజాగా, ఆకస్ కూటమితో ఆస్ట్రేలియా వైపు చూపుసారించినట్టు అర్థమవుతున్నది. అదీగాక, ఆస్ట్రేలియాకు అణుజలాంతర్గామిని ఆఫర్ చేసింది. దాని ఫలితంగా ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా అర్ధంతరంగా రద్దు చేసుకుంది. కనీసం మిత్రపక్షమని చూడకుండా ఫ్రాన్స్ ఒప్పందం రద్దు అయ్యేట్టు అమెరికా వ్యవహరించిందని ఫ్రాన్స్ రుసరుస లాడుతున్నది. ఈ విషయంలో ఇప్పటికీ అమెరికాపై ఫ్రాన్స్ మండిపడుతున్నది. కాగా, భారత్ నుంచీ వ్యతిరేకత వస్తున్నది. ఈ రీజియన్‌లో భారత్‌ను అమెరికా జూనియర్ భాగస్వామి స్థాయికి దిగజార్చిందనే ఆందోళనలూ వచ్చాయి.

Also Read: పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

ఇలాంటి తరుణంలో తాజాగా అమెరికా చట్ట సభ్యుల ప్రతినిధులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడారు. అందులోనూ రీజనల్ అంశాలపై, అంతర్జాతీయ స్థిరత్వం, శాంతిపై చర్చించడంపై ఆకస్ కూటమిని మరోసారి తెరపైకి తెచ్చినట్టయింది. అదీగాక, చైనా దేశం అటు అమెరికాకు, ఇటు ఇండియాకు కంటగింపుగా మారుతున్నదనే అర్థంలో ఉభయ దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల్లో సారూప్యత పెరుగుతున్నదని చర్చించుకోవడం గమనార్హం.

click me!