జైలులో 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ.. వైరస్ సోకడానికి కారణం అదేనా?

By telugu teamFirst Published Oct 10, 2021, 1:06 PM IST
Highlights

అసోంలోని సెంట్రల్ జైలు, స్పెషల్ జైలులో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకింది. ఇందులో సెంట్రల్ జైలు నుంచి 40 మందికి స్పెషల్ జైలు నుంచి 45 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌లో వీరికి హెచ్‌ఐవీ పరీక్షలు చేశారు. వీరంతా డ్రగ్స్ బానిసలని తెలిపారు. డ్రగ్స్ తీసుకోవడానికి ఒకే సిరంజీని వాడటం వల్ల హెచ్‌ఐవీ ఒకరి నుంచి ఒకరికి సోకి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.

గువహతి: అసోం సెంట్రల్ జైలు, స్పెషల్ జైలులో నివ్వెరపోయే రిపోర్టులు వెలికి వచ్చాయి. ఈ రెండు జైలులు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 85 మంది inmates HIV బారినపడ్డట్టు తేలింది. ఈ రెండు జైలులోని ఖైదీలందరికీ సెప్టెంబర్‌లో హెచ్ఐవీ టెస్టులు చేశారు. ఈ టెస్టుల ఫలితాలు జైలు అధికారులు, వైద్యులు సహా అందరినీ విస్తూపోయేలా చేశాయి. assamలో నగావ్ పట్టణంలోని ఈ jailలో మొత్తం 85 మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయని నగవా్ బీపీ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ సీ నాథ్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

Also Read: అసోం జైలులో 53 మంది ఖైదీలకు కరోనా..

హెచ్ఐవీ సోకినవారంతా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని వైద్యవర్గాలు తెలిపాయి. వారంతా డ్రగ్స్‌కు బానిసలయ్యారని వివరించాయి. ఆ మాదక ద్రవ్యాలను ఎక్కించుకోవడానికి వారంతా ఒకటే సిరంజీని వినియోగించి ఉండవచ్చని, అందుకే ఒకరి నుంచి ఇంకొకరికి హెచ్ఐవీ వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్నాయి. 

85 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ తేలినట్టు వచ్చిన వార్తలపై సెంట్రల్ జైలు, స్పెషల్ జైలు అదికారులు స్పందించి ధ్రువీకరించారు.

click me!