పసి బాలుడి కోసం విమానం అత్యవసర ల్యాండింగ్, అయినా దక్కని ప్రాణాలు...

First Published Aug 1, 2018, 10:58 AM IST
Highlights

కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్ లోని పాట్నా నగరానికి వెళుతున్న ఓ విమానం అత్యవసరంగా హైదరాబాద్ లో ల్యాండయింది. ఓ నాలుగు నెలల చిన్నారి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో మెడికల్ ఎమర్జెన్సీ కింద హైదరాబాద్ కు డైవర్ట్ చేశారు. ఇంతచేసినా చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కలేదు. 

మంగళవారం ఉదయం ఇండిగో 6ఈ897 విమానం ప్రయాణికులతో బెంగళూరు నుండి పాట్నాకు బయలుదేరింది. ఈ విమానంలో సందీప్ శర్మ, పునీతా దంపతులు తమ నాలుగు నెలల చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే మార్గమధ్యలో చిన్నారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఊపిరి తీసుకోవడానికి చిన్నారి ఇబ్బందిపడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు విమాన సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో విమాన సిబ్బంది మెడికల్ ఎమర్జెన్సీ కింద విమానాన్ని వెంటనే హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అక్కడి నుండి చిన్నారిని ప్రత్యేక అంబులెన్స్ లో విమానాశ్రయంలోని అపోలో క్లిసిక్ కు తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!