సీఎంని కించపరుస్తూ పోస్ట్... జర్నలిస్ట్ సహా నలుగురు అరెస్ట్

By telugu teamFirst Published Jun 10, 2019, 11:12 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ ని కించపరుస్తూ... ఫేస్ బుక్ లో పోస్ట్  పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ ని కించపరుస్తూ... ఫేస్ బుక్ లో పోస్ట్  పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం రెండు రోజుల్లో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో ఒకరు ఫ్రీలాన్సర్ టీవీ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సీఎం యోగి తనని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారని.. తనుకు ఆయనతో ఎప్పటి నుంచో సంబంధం ఉందంటూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతన్న వీడియోను ఓ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కాగా... ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

దీంతో.. సీఎం ప్రతిష్టను భంగపరిచేలా ప్రవర్తించారనే కారణంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఆ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి.. సీఎం పై అభ్యంతర కామెంట్స్ చేసిన మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు. తప్పుడు పోస్ట్‌ను షేర్‌ చేసినందుకు ఐపీసీ సెక్షన్‌ 500 ప్రకారం వారందరనీ అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

అయితే...వీరిని అరెస్టు చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజలకు భావవ్యక్తీకరణ, స్వేచ్ఛ కూడా లేవా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
 

click me!