నోయిడా స్కూల్లో రేప్, బాలిక హత్య: బలవంతంగా అంత్యక్రియలు

By telugu teamFirst Published Jul 14, 2020, 7:42 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో దారుణం జరిగింది. బోర్డింగ్ స్కూల్లో ఓ బాలిక శవమై తేలింది. తమ కూతురిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో దారుణం జరిగింది. బోర్డింగ్ స్కూల్లో ఓ బాలిక శవమై కనిపించింది. తమ కూతురిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారని, తమకు చెప్పకుండా బాలిక అంత్యక్రియలు చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ఆ సంఘటన జులై 3వ తేదీన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆందోళన చెలరేగడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని, తమకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. 

తగిన సాక్ష్యాధారాలతో కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అంటున్ారు. నోయిదా స్కూల్ సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హర్యానాలోని మహేంద్రగడ్ జిల్లాకు చెందిన బాలిక కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు లేఖ రాశారు. 

న్యాయం కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, తమ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదని పదో తరగతి చదువుతున్న మృతురాలి తల్లి కోరుతోంది. సోషల్ మీడియా ద్వారా మాత్రమే తమకు సంఘటన గురించి తెలిసిందని, అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు అంటున్నారని, ఈ సంఘటనపై తాము చర్యలు తీసుకుంటామని, పోలీసులు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి సంఘటనా స్థలం నుచి సమాచారం సేకరించారని అదనపు డిప్యూటీ పోలవీసు కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు. 

బాలిక ఆత్మహత్య చేసుకుందని, సూసైడ్ నోట్ కూడా రాసిందని తమకు తెలిసిందని ఆయన అన్నారు. పోలీసులు సమాచారం సేకరించి కుటుంబ సభ్యులకు తగిన సమాచారం ఇచ్చారని చెప్పారు. అయినా సంతృప్తి చెందకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.

తమ ముగ్గురు కూతుళ్లు కూడా పాఠశాలలో చదువుతున్నారని, కుమారుడు అదే పాఠశాల మరో బ్రాంచ్ లో చదువుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు.  లాక్ డౌన్ కారణంగా పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు. తిరిగి జూన్ 18వ తేదీన పాఠశాలకు తిరిగి వెళ్లారు. 

జులై 3వ తేదీన తమకు ఫోన్ రావడంతో తాము పాఠశాలకు వెళ్లామని, తమ ఫోన్లను లాక్కున్నారని, తమ కూతురు శవాన్ని చూపించారని, అంత్యక్రియలకు సంబంధించి తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాలిక తల్లి అంటోంది. తాము ప్రతిఘటించినప్పటికీ బాలిక అంత్యక్రియలు చేశారని ఆమె ఆరోపించింది. 

తమ బాలికపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత చంపేశారని, అందుకే పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు తమతో ఆ విదంగా వ్యవహరించారని ఆమె ్న్నారు. 

click me!