Raj Kundra : రాజ్ కుంద్రా ఫోన్ లో 119 పోర్న్ వీడియోలు.. తొమ్మిదికోట్లకు బేరం..!

By AN TeluguFirst Published Sep 21, 2021, 12:28 PM IST
Highlights

విచారణలో భాగంగా రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్ డిస్క్ లను పరిశీలించామని,  వాటిల్లో మొత్తం 119 నీలి చిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు.  ఆ వీడియోలు అన్నింటిని  కుంద్రా  తొమ్మిది కోట్ల రూపాయలకు బేరం పెట్టినట్లు తెలిపారు.

ముంబాయి : అశ్లీల చిత్రాల కేసు(Porn Racket Case) లో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) గురించి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కొన్ని కొత్త విషయాలు బయటపెట్టారు.  రెండు నెలల పాటు పోలీసులకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా కేసుపై  క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పందించారు.  

విచారణలో భాగంగా రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్ డిస్క్ లను పరిశీలించామని,  వాటిల్లో మొత్తం 119 నీలి చిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు.  ఆ వీడియోలు అన్నింటిని  కుంద్రా  తొమ్మిది కోట్ల రూపాయలకు బేరం పెట్టినట్లు తెలిపారు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబై శివారు లోని ‘ మాద్  దీవి’ లోని  ఓ బంగ్లాలో  పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు.  

అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నం గా కనిపించారు.  దీంతో అక్కడున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆ తర్వాత ఐదు నెలల పాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టును బయట పెట్టారు. ఇందులో భాగంగానే  ‘హాట్ షాట్స్’ యాప్  నిర్వహిస్తున్న రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.  రాజ్ కుంద్రా  అరెస్ట్  బాలీవుడ్లో  ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. 

కాగా, పోర్నోగ్రఫీ కేసులో ముద్దాయిగా ఉన్న రాజ్ కుంద్రాకు ముంబై కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ. 50000 పూచీకత్తుపై రాజ్ కుంద్రాతో పాటు అతని అసోసియేట్ రియాన్ థోర్ప్ కి బెయిల్ లభించింది. దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన రాజ్ కుంద్రా, విడుదల కావడం జరిగింది. భర్తకు బెయిల్ లభించగా, శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

పోర్నోగ్రఫీ కేసు: రాజ్ కుంద్రాకు బెయిల్... శిల్పా శెట్టి ఫస్ట్ రియాక్షన్!

శిల్పా శెట్టి పరోక్షంగా మంచి రోజులు వచ్చాయంటూ, రాజ్ కుంద్రా విడుదలపై ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పోస్ట్ చేశారు. ఓ భీకర తుపాను తరువాత వచ్చే ఇంద్ర ధనుస్సు, చెడు తరువాత మంచి జరుగుతుందని చెప్పడానికి నిదర్శనం... అంటూ ఆమె కోట్ చేశారు. విచారణ పేరుతో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదల కావడాన్ని, ఆమె సోషల్ మీడియా పోస్ట్ తెలియజేస్తుంది. 

మరోవైపు 1500 పేజీల ఛార్జ్ షీట్ ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్ట్ కి సమర్పించారు. శిల్పా శెట్టితో పాటు 43మంది సాక్షుల వాంగ్మూలం, ఛార్జ్గ్ షీట్ లో పొందుపరిచారు. 

click me!