సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

By narsimha lodeFirst Published Oct 26, 2018, 12:02 PM IST
Highlights

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీవీసీని ఆదేశించింది

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీవీసీని ఆదేశించింది. సీవీసీ విచారణ సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలోనే సాగాలని కోర్టు  అభిప్రాయపడింది.

శుక్రవారం నాడు సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు విచారణ చేసింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన ఎం. నాగేశ్వరరావు  కేవలం అడ్మినిస్ట్రేటివ్ వ్యహరాలను మాత్రమే చూడాలని కోర్టు ఆదేశించింది. పాలనపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను బదిలీ చేయడంపై తమకు  ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.సీబీఐ డైరెక్టర్ పై విచారణకు మూడు వారాల గడువును సీవీసీ కోరింది. కానీ రెండు వారాలు మాత్రమే సుప్రీం ఇచ్చింది.

అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సీవీసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు  జారీ చేసింది.  ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

సంబంధిత వార్తలు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

 

click me!