సగం మంది పురుషులు అక్కడ ఫెయిల్.. సమస్య ఇదే

By telugu team  |  First Published Jul 5, 2019, 3:22 PM IST

సగానికి సగం మంది పురుషులు శృంగారంలో సక్సెస్ కాలేకపోతున్నారట. అంగస్తంభన సమస్యతో బెడ్ మీద ఫెయిల్ అయిపోతున్నారట. 



సగానికి సగం మంది పురుషులు శృంగారంలో సక్సెస్ కాలేకపోతున్నారట. అంగస్తంభన సమస్యతో బెడ్ మీద ఫెయిల్ అయిపోతున్నారట. తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో ఎక్కువ మంది యువకులే ఉండటం గమనార్హం.

50ఏళ్లలోపు ఉన్న పురుషుల్లో 50శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. లండన్ లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా వారి సర్వేలో తేలిందేమిటంటే.. పురుషుల్లో సెక్స్ సామర్థ్యం రోజు రోజుకీ తగ్గిపోతోందట.

Latest Videos

undefined

బ్రిజెలిలోని 40ఏళ్లలోపు వయసు వారిపై వారు ఈ సర్వే నిర్వహించారు కాగా... 18 నుంచి 25 వయసులోపుగల వారిలో దాదాపు 35.6శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఇక 26నుంచి 40ఏళ్లలోపు వారిలో 30.7శాతం మంది ఈ ఇబ్బంది పరిస్థితితో నలిగిపోతున్నారట. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక పరిష్కారం తెలీక చాలా మంది కుంగిపోతున్నట్లు తేలింది.

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి వల్ల దీని బారిన పడుతున్నారని తేలింది. హృద్రోగ సమస్యలు, మతిమరుపు, అకాల మరణం లాంటివి కూడా ఏర్పడుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 322 మిలియన్ల పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారని వెల్లడించారు. 1995లో ఆ సంఖ్య 152 మిలియన్లుగా ఉండేది. యూకేలో 11.7 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, ప్రతి 8 మందిలో ఒకరు బాధితులేనని పేర్కొన్నారు.
 

click me!