టొమాటో ఫ్లూ: లక్షణాలేంటి.. ఇది సోకకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

By Mahesh RajamoniFirst Published Aug 21, 2022, 9:46 AM IST
Highlights

టొమాటో ఫ్లూ:  టొమాటో ఫ్లూ ఒక అంటురోగం. ఇది చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుంది. ఇప్పటి వరకు మన  దేశంలో ఇది  82 మంది పిల్లలకు వచ్చింది. అందుకే దీని విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

టొమాటో ఫ్లూ:  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఒక దిక్కు కరోనా.. మరోదిక్కు మంకీపాక్స్.. ఇంకో వైపు టొమాటో ఫ్లూ. ఈ మూడు దారుణంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. అందుకే వీటి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చిరిస్తూనే ఉంది. ఇక పిల్లలకు ఎక్కువగా సోకుతున్నఈ  టొమాటో ఫ్లూ కూడా ప్రమాదకరమైందే.  ఈ వ్యాధి బారిన పిల్లల నోటిపై, చేతులపై, పాదాలపై ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. 

లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ ప్రకారం.. కేరళలోని కొల్లాం లో మే 6 న ఈ టమాటా ఫ్లూ కేసులు మొదటి సారిగా గుర్తించబడ్డాయి. ఇక ఈ వ్యాధి ఇప్పటి వరకు 82 మంది పిల్లలకు వ్యాపించింది. అయితే ఈ వ్యాధి సోకిన పిల్లలందరూ ఐదేండ్లలోపు వారేనని లాన్సెట్ నివేదిక చెబుతోంది. ఈ వ్యాధి వల్ల వచ్చే ఎర్రని దద్దుర్లు, బొబ్బల కారణంగా  ఈ అంటువ్యాధికి ‘టొమాటో ఫ్లూ’ అని పేరు పెట్టారు. 

లక్షణాలు

టొమాటో ఫ్లూ వల్ల నమోదైన కేసుల్లో ఇప్పటివరకు దీని లక్షణాలు చికెన్ గున్యా లాగే ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. మరి ఈ అంటువ్యాధి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. 

దద్దుర్లు
టమాటా లాంటి ఎర్రని బొబ్బలు
విపరీతమైన జ్వరం
శరీర నొప్పులు    
కీళ్ల నొప్పులు
నీరసం
నిర్జలీకరణ

దీన్ని నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎలాంటి ఫ్లూ బారిన పడకూడదన్నా.. మనం ముందుగా చేయాల్సింది పరిశుభ్రతను పాటించడం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా ఇంటిని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవాలి. రోజూ శానిటైజ్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్లో ఏవైనా లక్షణాలు కననిపిస్తే తల్లిదండ్రులు వెంటనే హాస్పటళ్లకు వెళ్లాలి. వారి సలహాలను, సూచనలను పాటించాలి. అయితే ఈ వ్యాధి వల్ల వచ్చే బొబ్బలను, దద్దుర్లు పగిలిపోకుండా నివారించొచ్చు. అయితే ఈ లక్షణాలు ఎక్కువ కాకుండా ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని ఆపుతారు. 

అయితే టమాటా ఫ్లూ లక్షణాలు కొన్ని కరోనా లాగే ఉన్నాయి. అలా అని దీనికి కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా ఈ టమాటా ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలో కూడా కనిస్తాయి. సాధారణంగా ఇది పేగు వైరస్ మూలంగా వస్తుంది. ఇది పెద్దవారికే  అరుదుగా సోకుతుంది. అదికూడా రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికే. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంట రోగాలు రావు. అందుకే రోగనిరోధక వ్యస్థను బలంగా చేసే ఫుడ్స్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!