రష్మిక మందన మెరుపుతీగలాంటి అందంకోసం.. ఎలాంటి డైట్, ఫిట్ నెస్ ట్రై చేస్తుందంటే..

By AN TeluguFirst Published Oct 20, 2021, 1:00 PM IST
Highlights

పాతికేళ్ల ఈ సొగసరి తను అందంగా, స్లిమ్ గా కనిపించడం కోసం.. ఫిట్ నెస్ బాగా కోసం చాలా కష్టపడుతుందట. గంటల కొద్ది జిమ్ లో గడుపుతుందట.. వర్కవుట్స్ గురించి పాజిటివిటీ పోస్ట్ లు పెడుతుంది. 

కన్నడ నటి అయిన రష్మిక మందన్న.. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తరువాతి కాలంలో రష్మిక national crush గా.. తన అందం కోసం beast లా పనిచేస్తుందట.

పాతికేళ్ల ఈ సొగసరి తను అందంగా, స్లిమ్ గా కనిపించడం కోసం.. ఫిట్ నెస్ బాగా కోసం చాలా కష్టపడుతుందట. గంటల కొద్ది జిమ్ లో గడుపుతుందట.. వర్కవుట్స్ గురించి పాజిటివిటీ పోస్ట్ లు పెడుతుంది. 

రష్మిక మందన ఫ్యాన్ అయితే... ఆమెను ఫాలో అవ్వాలనుకుంటే ashmika mandanna చెబుతున్న ఈ fitness tricks, diet అలవాట్లు చూడండి. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకోవడం కోసం.. తాను ఎంత బిజీగా ఉన్నా.. ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో ఉన్నా ఫిట్ నెస్ కోసం టైం కేటాయించడం మరిచిపోదట. వారానికి కనీసం 4,5 సార్లు జిమ్ లో గడుపుతుందట. అది కూడా సాయంత్రాలు. 

ఆమె తన workouts trendyగా ఉండాలని ఆలోచిస్తుందట. దీనికోసం స్ట్రెంథ్ ట్రైనింగ్స్ ను చేస్తుందట. వీటిల్లో కోర్, కార్డియో లాంటి వెయిట్ ట్రెయినింగ్స్ కూడా ఉంటాయట. 

ఒక వేళ జిమ్ కు వెళ్లలేకపోతే పవర్ యోగా చేస్తుందట. kick boxingతో పాటు swimming కూడా చేస్తుందట. వీటన్నింటితో పాటు ఫిట్ నెస్ కోసం వాకింగ్ కూడా చేస్తుంది. వాకింగ్ తనను రిలాక్స్ చేస్తుందని చెబుతోంది. 

రష్మిక తన రోజును detoxing తో మొదలు పెడుతుంది. దీనికోసం నీళ్లు, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన ద్రావణాన్ని తాగుతుంది. ఇది మెటబాలిజంను పెంచి, వెయిట్ లాస్ కు పనిచేస్తుంది. 

హెల్తీగా, ఆరోగ్యంగా ఉండడం కోసం రష్మిక తన డైట్లో చాలా disciplinedగా ఉంటుంది.  దానికోసం ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే ఇష్టపడుతుంది. అంతేకాదు ఆహారంలో అన్నం అసలు తినదు. ఆమె ఫేవరేట్ ఫుడ్స్ ఏంటో తెలుసా.. రెగ్యులర్ ఫుడ్ తో పాటు పండ్లు, స్వీట్ పొటాటో, సూప్స్ తీసుకుంటుంది. ఇక స్నాక్స్ గా నట్స్, సీడ్స్ ను ప్రిఫర్ చేస్తుంది. 

రష్మిక మందన నాచురల్ బ్యూటీ. అయినా కూడా చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. నాచురల్ గా అందంగా కనిపించడం కోసం ఎంతో శ్రమిస్తుంది. బ్యూటీ కోసం పైనుంచి రాసే క్రీములు, లోషన్లు, మేకప్ లే కాదు... ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలంటారామె. 

తన చర్మ సంరక్షణ, అందంకోసం రష్మిక అలర్జీ టెస్ట్ చేయించుకుందట. తన శరీరానికి ఎలాంటి ఆహారాలు పడతాయి, ఎలాంటి వాటితో ఎలర్జీ వస్తుందనేది ముందు టెస్టు ద్వారా తెలుసుకుని ఆ తరువాత దాన్నే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యిందట. దీనివల్లే తన చర్మం అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోతుందని చెబుతుంది ఈ బ్యూటీ. 

అలాగే తినే విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది రష్మిక. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, చర్మానికి హాని చేసే ఆహారాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటుంది. సన్ స్క్రీన్ లోషన్ లేకుండా ఇంట్లోనుంచి అడుగు బైటికి పెట్టదట. 

అంతేకాదు చర్మ సౌందర్యం కోసం.. రష్మిక మందన క్రమం తప్పకుండా విటమిన్ సి సీరమ్ ను వాడుతుంది. దీనివల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా.. చర్మం నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా తయారవుతుంది. 
 

click me!