ఈ ఏడాది చివరి సూపర్ మూన్.. మిస్ అవ్వకండి..!

By telugu news teamFirst Published Aug 12, 2022, 10:44 AM IST
Highlights

 ఫిబ్రవరిలో ఓసారి, జూన్ లో స్ట్రాబెర్రీ మూన్ గా, జులైలో బక్ మూన్ గా కనిపించిన చందమామ... చివరగా.. ఈ ఆగస్టు నెలలో మరోసారి కనిపించింది. ఈ సూపర్ మూన్ కి సర్జన్ మూన్ అని పేరు పెట్టారు.

ఆకాశంలో మరోసారి అద్భుతం కనువిందు చేసింది. ఈ ఏడాది చివరి సూపర్ మూన్ మనకు దర్శనమిచ్చింది. ఇప్పటికే ఈ సంవత్సరం చాలా సార్లు మనకు సూపర్ మూన్ కనిపించింది. ఫిబ్రవరిలో ఓసారి, జూన్ లో స్ట్రాబెర్రీ మూన్ గా, జులైలో బక్ మూన్ గా కనిపించిన చందమామ... చివరగా.. ఈ ఆగస్టు నెలలో మరోసారి కనిపించింది. ఈ సూపర్ మూన్ కి సర్జన్ మూన్ అని పేరు పెట్టారు. ఉత్తర అమెరికాలో ఈ సర్జన్ మూన్  కనిపించింది.

ఈ సూపర్ మూన్ ఆగస్టు 11, ఆగస్టు 12వ తేదీల్లో  కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి శుక్రవారం తెల్లవారుజామునే సూపర్ మూన్ కనపడటం గమనార్హం. ఈ రోజు రాత్రి కూడ కనిపించే అవకాశం ఉంది. నిన్న మిస్ అయిన వారు.. కనీసం ఈ రోజు చూసి ఆనందించవచ్చు.


సూపర్‌మూన్ అంటే ఏమిటి?
చంద్రుడు దాని దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్న సమయంలో సూపర్‌మూన్ ఏర్పడుతుంది. ఈ స్థానాన్ని పెరిజీ అని పిలుస్తారు మరియు భూమి చుట్టూ దాని 27-రోజుల కక్ష్యలో, చంద్రుడు భూమికి 3,63,711 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ దశలో, చంద్రుడు సాధారణం కంటే పెద్దగా,ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూపర్ మూన్ సాధరణ రాత్రుల కంటే 14 నుండి 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ సూపర్‌మూన్ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు కనిపించే అవకాశం ఉంది

ఆగస్టు 11 సూపర్‌మూన్ సంవత్సరంలో చివరిది కాగా... సూపర్ ఫుల్ మూన్ ఒక సంవత్సరం తర్వాత ఆగస్టు 1, 2023న మాత్రమే కనిపిస్తుంది. 2022 మాదిరిగానే, 2023లో కూడా నాలుగు సూపర్‌మూన్‌లు ఆకాశాన్ని తాకనున్నాయి, ఆ తర్వాత మరో నాలుగు 2024లో , 2025లో మూడు మనకు దర్శనమివ్వనున్నాయి.

click me!