Kidney Care:జాగ్రత్త.. ఇవి తింటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదముందట.. అవేంటో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jan 16, 2022, 12:00 PM IST
Highlights

Kidney Care: ఆరోగ్యమమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినైనా సునాయాసంగా చేయగలుగుతాం. అందులోనూ ఈ కరోనా కాలంలో ప్రజలందరూ తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనాను నియంత్రించడంలోనూ.. ఇతర రోగాలను తరిమికొట్టడంలోనూ రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. అందుకే...

Kidney Care: ఆరోగ్యమమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినైనా సునాయాసంగా చేయగలుగుతాం. అందులోనూ ఈ కరోనా కాలంలో ప్రజలందరూ తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనాను నియంత్రించడంలోనూ.. ఇతర రోగాలను తరిమికొట్టడంలోనూ రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. 

నేడు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులోనూ కరోనా బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మంచి ఆహారాన్నే తింటున్నారు. అలాగే  fit  గా ఉండటం కోసం ఎన్నో వ్యాయామాలను సైతం చేసేస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టు మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగు కోసమమని మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చే ప్రమాదం ఉంది. అందులోనూ మనం రోజూ తినే food వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

మద్యం (Alcohol) అతిగా తాగడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. దీని మూలంగా మూత్రపిండాల పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటుగా కాఫీ తాగితే కూడా మూత్రపిండాల పనితీరులో అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాఫీ లో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుందని  ఇటీవలె జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కాఫీ ఎక్కువగా ఎవరైతే తాగుతారో వారికే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందట. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. 

శరీరానికి మాంసాహారం బాగా ఉపయోగపడుతుంది. మాంసం తింటే కండరాల పెరుగుదలతో పాటుగా ప్రోటీన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే వైద్యులు కూడా మాంసం తినాలని సలహాలిస్తుంటారు. అయితే మాంసం తినడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి అధికంగా కలుగుతుంది. అంతేకాదు .. మాంసం ఎక్కువగా తినేవారిలో  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. దీనికి తోడు కుకీలు, సాస్ లు ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీలల్లోరాళ్లు ఏర్పడతాయట. కాగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కూడా కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే అలాంటి వాల్లు కిడ్నీ సమస్యలను తెచ్చే రోగాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

కిడ్నీ డ్యామేజ్ అయ్యిందని ఎలా నిర్దారించుకోవాలంటే.. తరచుగా వాంతులు, నీరసంగా అనిపిస్తుంది. అలాగే మూత్ర విసర్జన కూడా తరచుగా అవుతూ ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యమైనవి.  ముఖ్యంగా one year కి ఒక సారైనా కిడ్నీ పరీక్షలు చేయించకోవడం తప్పనిసరి. 
 

click me!