Health Care : వయస్సు 40 దాటాయా..? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Published : Jan 16, 2022, 09:43 AM IST
Health Care : వయస్సు 40 దాటాయా..? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

సారాంశం

Health Care : వయస్సు మీద పడుతున్న కొద్ది బీపీ, షుగర్ వంటి అనేక వ్యాధులు సోకుతుంటాయి. అందులోనూ 40 ఏండ్లు దాటితే ఎక్కడలేని రోగాలన్నీ మన శరీరానికి అంటుకుంటాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన Brain stroke, హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

Health Care : వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరానికి కొత్త కొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది.  అందులోనూ వయస్సు మీద పడుతున్న కొద్ది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక 40 ఏండ్లు దాటిన వారు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్ లోనే అనేక రోగాలు సోకే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ age వారు ఆరోగ్యం పట్ల తగిన కేరింగ్ చూపాల్సిన అవసరం చాలా ఉంది. కాలంతో పాటుగా మన జీవన విధానం కూడా అనేక అనారోగ్య సమస్యలను దారితీస్తుంది. కల్తీ ఫుడ్, వాతావరణ కాలుష్యం, శరీరక శ్రమ వంటివి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అన్నింటిని మనకు అనుకూలంగా మార్చలేం కాబట్టి.. తీసుకునే ఆహారం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అనేక రోగాల బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. 

అయితే వయస్సు 40 దాటిన వారికి గుండె సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వయస్సు వారికే గుండె సంబంధిత వ్యాధులు సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే రోజు రోజుకు మారుతున్న మాన జీవన శైలీ, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఈ కారణంగానే చిన్న వయస్సు వారు సైతం ఈ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, జీవన విధానం సరిగ్గా లేకపోవడం మూలంగానే  Heart Problems వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ వయస్సు వారు శరీరంలోని Cholesterol levels ను తరచుగా పరీక్షలు చేయించుకోవాలని వైధ్యులు సూచిస్తున్నారు. అలాగే శరీరానికి అన్ని రకాలుగా మేలు చేసే ఆహారాన్నే తీసుకోవాలి. 40 ఏండ్లు దాటిన వారిలో డయాబెటిస్, బీపీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధులు సోకితే Brain stroke, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంత మంది వయస్సు మీద పడుతున్నా.. వైద్య పరీక్షలు చేయించుకోకుండా.. తమకు ఎలాంటి రోగాలు లేవనే బ్రమలో ఉంటారు. వయస్సు మీద పడుతున్నకొద్ది ఎక్కడ లేని రోగాలు దరిచేరే ప్రమాదం ఉంది. అందుకని వైద్యపరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే  బీపీ వల్ల పక్షవాతం (Paralysis) కి  గురయ్యే ప్రమాదం ఉంది. 

ఈ వయస్సు వారికి పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఇంటి గొడవలు, ఆందోళనలు వంటి అనేక మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి. వీటితో రాత్రుళ్లు కూడా సరిగ్గా నిద్రపోకుండా ఒత్తిగి గురవుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల అనారోగ్యం తప్ప ఏమీ రావు. ఇకపోతే ప్రతి రోజూ smoking చేయడం కూడా ప్రమాదమే. అలాగే మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే వయస్సు వారిగా వచ్చే అనేక రోగాలను దూరం పెట్టొచ్చు. ఇక 40 ఏండ్లు దాటిన వారు ఖచ్చితంగా 6 నెలలకోసారైన వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. అలా చేయించకుంటే మున్ముందు వచ్చే అనేక రోగాలకు సరైన వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుంది.

ఇకముఖ్యమైన విషయం ఏమిటంటే 40 ఏండ్లు దాటిని వారిలో అధికంగా ఎముకల్లో బలహీనత,  కండరాల క్షీణత వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఆ ఏజ్ లో కాల్షియం శరీరంలో ఎంత శాతం ఉందో పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. బలంగా, గట్టిగా ఉండాలంటే వైద్యుల సలహాలు తీసుకుని వాళ్లు సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఫుడ్ కండరాలు బలంగా, ఎముకలు గట్టిగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇకపోతే ఆ ఏజ్ లోనూ ప్రతిరోజూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. కాగా వయస్సు 40 దాటిన పురుషుల్లోనే శరీరంలో రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది. అందుకే వారు ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు