Ginger Tea : వాయమ్మో.. అల్లం టీ తాగితే ఇన్ని సమస్యలొస్తాయా..?

By Mahesh RajamoniFirst Published Jan 15, 2022, 5:10 PM IST
Highlights

Ginger Tea : అన్ని టీ లల్లో కెల్లా అల్లం టీ టేస్టే వేరబ్బా.. అందుకే దీన్ని తాగే వారు రోజుకు కప్పులకు కప్పులు గుటకాయ స్వాహా అనిపిస్తుంటారు. ఎన్నో ఔషద గుణాలున్న ఈ టీ తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ ఎరుకనే. మనకెంతో ఉపాయకారినిగా ఉన్న ఈ అల్లం టీ తాగితే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ వంటి అనేక సమస్యలతో పాటుగా మారిన్ని ప్రాబ్లమ్స్ అటాక్ చేసే ప్రమాదముందండోయ్.

Ginger Tea : అన్ని టీ లల్లో కెల్లా అల్లం టీ టేస్టే వేరబ్బా.. అందుకే దీన్ని తాగే వారు రోజుకు కప్పులకు కప్పులు గుటకాయ స్వాహా అనిపిస్తుంటారు. ఎన్నో ఔషద గుణాలున్న ఈ టీ తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ ఎరుకనే. మనకెంతో ఉపాయకారినిగా ఉన్న ఈ అల్లం టీ తాగితే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ వంటి అనేక సమస్యలతో పాటుగా మారిన్ని ప్రాబ్లమ్స్ అటాక్ చేసే ప్రమాదముందండోయ్. 

 ఏది ఉన్నా లేకున్నా టీ పక్కాగా కావాల్సిందే అని పట్టుపట్టేవారు నేడు చాలా మందే ఉన్నారు. పొద్దున లేచిన వెంటనే పక్కాగా టీతో గొంతు తడుపుకోవాల్సిందే. లేకుండా పాణమంతా గాయి గాయి అయితదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇదైతే నిజమే.. టీ కి బాగా అలవాటు పడిన వారు అది లేకుండా రోజును స్టార్ట్ కూడా చేయరు. గొంతులో టీ సుక్క దిగినాకనే మరేపనైనా చేయగలుగుతారు. ఆఫీసుల్లో ఏసీల కింద పనిచేసే వారి నుంచి మొదలు పెడితే.. అమాలి పనికి పోయే వారు కూడా టీ లేకుండా ఉండలేరు. పని మధ్యలో కాస్త బ్రేక్ దొరికితే చాలు టీ షాపుల్లో వాలిపోతుంటారు. కప్పులకు కప్పులు లాగించేస్తుంటారు. ఇక టీ లల్లో చాలా రకాలే ఉన్నాయి. బాదం టీ, లెమన్ టీ, అల్లం టీ అని చాలా రకాలుగానే టీ లు అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఇందులో ఎవరికి నచ్చిన టీ ని వారు లాగించేస్తుంటారు. అయితే నచ్చిన Food Items కంటే ఇష్టమైన టీ ని తాగడానికే ఇక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ముఖ్యంగా ఈ చలికాలంలో అల్లం టీ ప్రియులు చాలానే ఉంటారు. చలికాలంలో అల్లంతో చేసిన టీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని దీన్నే ఎక్కువగా తాగుతుంటారు. అల్లం టీ తాగితే దగ్గు, జబుబు, జ్వరం నుంచి తప్పించుకోచ్చు, ఇంకా అనేక రోగాల నుంచి బయటపడొచ్చని అపోహ పడిపోతుంటారు. కానీ అల్లం టీ తాగడం వల్ల ఉపయోగాల సంగతి పక్కన పెడితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ నివేధిక ప్రకారం అల్లం టీ తాగడం వల్ల శరీరం బలహీనంగా మారడంతో పాటుగా తరచుగా తల తిరగడం వంటివి జరుగుతాయని వైద్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. 

అలాగే ఎక్కువగా దీన్ని తాగడంతో జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా ఎక్కువవుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే. దీన్ని తాగితే శరీరం విశ్రాంతి లేమి సమస్య బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే దీన్ని మోతాదుకు మించి తాగితే Hair fall కూడా అవుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే మూలకమే జుట్టు ఊడేలా చేస్తుంది. అలాగే జుట్టు ఎదుగుదలను ఇది నిలిపేస్తుంది. ముఖ్యంగా రాత్రుళ్లు అల్లం టీ జోలికి పోకుండా ఉండాలి. మోతాదుకు మించి అల్లం టీ తాగితే ఏరి కోరి అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

click me!