మాగాడి కష్టాలు మీకేం తెలుసు? ..వెక్కివెక్కీ ఏడవలేనే... వెధవ మగ పుట్టుక

By Rekulapally SaichandFirst Published Nov 19, 2019, 4:34 PM IST
Highlights

నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ముందుగా మగవారందిరికి  మెన్స్ డే శుభాకాంక్షలు. పురుష  ప్రపంచానికి ఈ రోజు ప్రత్యేకమైనది.
అసలు ఈ రోజుని ఎందుకు జరుపుకుంటారు. అసలు ఈ డే ప్రత్యేకత ఏంటో ఓసారి తెలుసుకుందాం..
 

కుటుంబం.. భార్య, పిల్లలు, మనిషికో అవసరం,  ఇవన్ని తిరాలంటే చివరిగా చూసేది ఆయన వైపే.. ఎంత ఓర్పు ఎంత సహనం. ముందు అందమైన  చోక్కా కనిపించవచ్చు కానీ దానికి వెనుకలా గాయపడ్డ ఆయన మనసు ఉంటుంది.మగాళ్లకూ కష్టాలు ఉంటాయి. మగాళ్లకూ కన్నీళ్లు ఉంటాయి. ఆడవాళ్ళ ఏడుస్తే పైకి కనిపిస్తుందేమో.. మగాడి  కన్నీటి ధారా  హృదయంలో చేరి జలపాతంలా ఉపొగ్గుతాయి.  

 

అది బయటకు కనిపించదు. గుండెల్లో ఆర్తనాదం మనసులోన భావావేశంతనలో  తనే కుమిలిపోతాడు. బయటకు కఠినంగా కనిపించొచ్చేమో గానీ  లోపల స్పందించే హృదయం ఉంటుంది. పిల్లలకు ఓ తండ్రిగా   భార్యకు ఓ మంచి భర్తగా , కోడుకుగా తల్లిదండ్రులకు,ఇలా అందరి జీవితాలలో మగవారు భాగమై ఉంటారు. కుటుంబ పోషణ భారం మెుత్తం ఆయనపైనే.. అమ్మో ఒకటో తారీఖా!  రోజు వస్తుందంటే మగాడు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. ఇంట్లో ఈగల మోత.. బయట పైసల వాత అన్నట్లయింది పరిస్థితి.

ఇంటి అద్దె కట్టాలి.  పిల్లల స్కూలు, ట్యూషన్‌ ఫీజులు, స్కూల్‌ వ్యాన్‌ రుసుము.. చిట్టీలు..పాల బిల్లు. కరెంటు బిల్లు..ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ 
ఇటు చూస్తే నోయ్యి అటూ చూస్తే గోయ్యి అన్నంటు ఉంటుంది పరిస్ధితి. అప్పుల తిప్పలు తప్పవు. ఆర్థిక అవసరాల మధ్య పురుష ప్రపంచం నలిగిపోతుంది.

 

ఇవన్ని ఎందుకంటే నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ముందుగా మగవారందిరికి  మెన్స్ డే శుభాకాంక్షలు. పురుష  ప్రపంచానికి ఈ రోజు ప్రత్యేకమైనది. అసలు ఈ రోజుని ఎందుకు జరుపుకుంటారు. అసలు ఈ డే ప్రత్యేకత ఏంటో ఓసారి తెలుసుకుందాం..

 
మహిళలకు అంటూ ఓ రోజు ఉంది మరి పురుషులకు. ఈ ఆలోచనతోనే అమెరికాలోని మిసోరి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ ఓస్టర్‌ 1992 ఫిబ్రవరి 7న పురుషుల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అయితే ఈ రోజు ఎక్కువగా ప్రచూర్యం పోందలేదు . 1999 నవంబర్ 19న ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో  తొలిసారిగా ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ జరిగింది.

దీన్ని ప్రొఫెసర్‌ జిరోమ్‌ తీలక్‌సింగ్‌   యుఎన్‌ఓ ఆమోదంతో  ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.  అప్పటి నుంచి దాదాపు ఎనభై దేశాలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నిర్వహిస్తున్నాయి అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యం అంతర్జాతీయ పురుషుల దినోత్సవ కార్యక్రమాలకు రావడం లేదు.

ఈ రోజుకు ముఖ్య ఉద్దేశం సమాజంలో రోజుకు రోజుకు తగ్గిపోతున్న   లింగ భేదాలను తగ్గించి సమా సమాజ స్ధాపన ధ్యేయంగా పని చేయడం. స్తీ.పురుష భేదం లేకుండాసమాజంలో అందరు సమానమే భావన కలిపించడం. కష్టాల కడలిని ఈదే మహిళల పట్ల సమాజంలో ఉండే సానుభూతి పురుషులపై మచ్చుకైనా కనిపించదు.

మగవారి కష్టాలు ఉంటాయి దాన్ని అర్ధం చేసుకునే మనస్సు స్త్రీ కూడా ఉండాలనే  ఉద్దేశాన్ని కలిగించడం. ఆర్థిక పరమైన బాధ్యతాలు  ఆడవారి కంటే మగవారిపైనే ఎక్కవగా ఉంటాయి. 

కాబట్టి అలాంటి కష్టపడే హృదాయాన్ని జీవిత భాగస్వామి ఆర్ధం చేసుకోవాలనే చిన్న సృహ కలిపించే దినం.వైవాహిక సామరస్యం, కుటుంబ వ్యవస్థ  చిన్నభిన్నం అవడానికి మెుదటి కారణం అనుమానం భూతం. ఆడవారు అనవసరపు అనుమానాలతో పెట్టుకుని వైవాహిక బంధం స్వస్తి పలుకుతున్నారు.

కావున నిజంగా కనిపించే ప్రతి మగాడు అలాంటి వాడేనా! వారికి ఆ ఉద్దేశం ఉందా అనే ప్రశ్న వారిలో మెుదలవ్వాలి. అనుమానపు జాడాలను వదిలి వైవాహిక బంధాన్ని బల పరుచుకోవాలని సందేశాన్ని ఇస్తూ లింగ వివక్ష లేని సమాజాన్ని అవతరించాలనే స్పూర్తితో జరుపుకునేది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.
 

click me!