ఈ మందుబిల్లలు మీ సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి.. అంతేకాదు నపుంసకులుగా కూడా మార్చగలవు జాగ్రత్త..

By Mahesh RajamoniFirst Published Sep 25, 2022, 3:50 PM IST
Highlights

పలు అధ్యయనాల ప్రకారం.. కొన్ని రకాల మందులు మీసెక్స్ డ్రైవ్ తగ్గిస్తాయట. అందుకే వాటి వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.  

సెక్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది సిగ్గుపడతారు. కానీ సెక్స్ భార్యాభర్తలిద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. సెక్స్ గుండె జబ్బులను తగ్గించడం నుంచి ఓవర్ వెయిట్, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను కూడా పెంచుతుంది. అయితే కొన్ని రకాల మెడిసిన్స్ సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

1. పెన్ కిల్లర్: పెన్ కిల్లర్ ట్యాబ్లెట్లు లైంగిక జీవితం పై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. పెయిన్ కిల్లర్ మందులు టెస్టోస్టెరాన్, హార్మోన్లను తగ్గిస్తాయి. ఈ హార్మోన్లే ఇవి పురుషులు, మహిళల్లో లైంగిక కోరికను పెంచుతాయి.

2. యాంటీ డిప్రెసెంట్స్: ఈ మందులను డిప్రెషన్  ను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వీటిని లిబిడో కిల్లర్స్ అని కూడా పిలుస్తారు. వీటిని వాడటం వల్లసెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం, ఆలస్యమైన స్ఖలనం యాంటి డిప్రెసెంట్స్ వల్ల కలుగుతాయి. ఇవి పురుషుల్లో నపుంసకత్వాన్ని కూడా కలిగిస్తాయి.

3. గర్భనిరోధక మాత్రలు: ప్రస్తుతం చాలా మంది ఆడవారు గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్ల వాడకం వల్ల సెక్స్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. మీ సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఈ మాత్రలను వాడటం మానేయండి. 

4. స్టాటిన్స్, ఫైబ్రేట్స్: వీటిని కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కానీ వీటి వాడకం వల్ల టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఓ పరిశోధన ప్రకారం.. ఈ మందుల వాడకం లింగ లోపాలకు కారణమవుతుంది.

5. బెంజోడియాజిపైన్స్ (Benzodiazepines):నిద్రలేమి, ఆందోళన, కండరాల నొప్పులను తగ్గించుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ మందులు సెక్స్ పై ఆసక్తిని తగ్గిస్తాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.

6. రక్తపోటు మందులు: రక్తపోటును తగ్గించడానికి వాడే మందులు కూడా లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పురుషుల్లో ఈ ఔషధాల వాడకం వల్ల లైంగిక వాంఛ తగ్గుతుంది. అంగస్తంభన సమస్య కూడా తలెత్తుతుంది. ఇక మహిళల్లో యోని పొడిబారడం, సెక్స్ పై కోరికలు తగ్గడం, ఉద్వేగం వంటి సమస్యలు వస్తాయి. 

7. యాంటిహిస్టామైన్ : తరచుగా ముక్కు కారడం, తుమ్ములు వంటి అలర్జీ సంబంధిత లక్షణాలను తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటి వాడకం వల్ల పురుషుల్లో అంగస్తంభన లోపం లేదా స్ఖలనం సమస్యలు వస్తాయి. ఇక ఆడవారిలో యోగి పొడిబారుతుంది. 

click me!