మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని మందు బాటిల్‌పైనే రాస్తారు. అయినా కూడా మందుబాబులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. బీరు, విస్కీ, వోడ్కా.. ఇలా రకరకాల పేర్లతో మద్యం సేవిస్తుంటారు. అయితే విస్కీ తాగే సమయంలో అందులో కొన్ని రకాల డ్రింక్స్‌ను మిక్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మద్యపాన ప్రియుల్లో విస్కీ తాగే వారే అధికంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో మెజారిటీ వాళ్లు విస్కీలో సోడాను కలుపుకొని తాగుతుంటారు. విస్కీలో సోడాలో మిక్స్ చేసుకుంటే ఆల్కహాల్ తీవ్రత తగ్గి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ అభిప్రాయంలో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. విస్కీలో సోడా కలుపుకొని తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఆల్కహాల్‌లో సోడా కలపడం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే..
ఆల్కహాల్ తీసుకున్న వెంటనే మత్తుగా ఉండడం సర్వసాధరణమైన విషయం. ఆల్కహాల్ రక్తంలోకి శోషించడం ద్వారా మత్తు భావన కలుగుతుంది. అయితే మందులో సోడాను మిక్స్ చేయడం ద్వారా ఆల్కహాల్ రక్తప్రవాహంలో వేగంగా శోషించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోడాలోని కార్బొనేషన్ దీనికి కారణంగా చెబుతున్నారు. దీంతో త్వరగా మత్తు కలుగుతుంది. ఇక మందులో సోడా మిక్స్ చేసుకోవడం ద్వారా ఆల్కహాల్ తీవ్రత కూడా తగ్గుతుంది. దీంతో మనకు తెలియకుండా ఆల్కహాల్ తీసుకునే మోతాదు కూడా పెరుగుతుంది. ఇది కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
undefined
మద్యంలో సోడా కలుపుకొని తాగడం వల్ల మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంలో ఇదే అలవాటును కొనసాగిస్తే మూత్ర పిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే సోడా వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. విస్కీలో సోడా కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బుతుంది. అజీర్తి, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.
సాధారణంగానే మద్యం గుండె సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. అధికంగా మద్యం సేవించే వారిలో రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా సోడాలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రక్తపోటును పెంచుతుంది. దీంతో ఇది హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోడా కాలేయ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.
సోడాలో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంను తగ్గిస్తుంది. దీంతో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆల్కహాల్‌లో సోడా మిక్స్ చేసుకొని తాగితే ఎములక ఆరోగ్యం క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఈ యాసిడ్ దంతాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది.
ఇక కొందరు విస్కీలో కూల్‌డ్రింక్స్ కూడా కలుపుకొని తీసుకుంటుంటారు. అయితే ఇది కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. కూల్‌డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనే షుగర్ ఎక్కువ కంటెంట్‌లో ఉంటుంది. ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇది కూడా చదవండి: చాణక్య నీతి ప్రకారం.. భార్యాభర్తలు ఇలా ఉంటేనే అది సరైన సంసారం