మిగిలిపోయిన ఇడ్లీలను చాలా మంది ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల వాటి రుచి మారుతుంది. అలాగే ఇడ్లీలు బాగా గట్టిపడతాయి. కానీ కొన్ని పద్దతుల్లో ఇడ్లీలను మళ్లీ ఫ్రెష్ గా, మెత్తగా, వేడిగా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?
ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి తేలిగ్గా అరగడం వల్ల రోజూ ఇదే బ్రేక్ ఫాస్ట్ ను తినేవారు ఉన్నారు. కానీ కొంతమంది మంది మాత్రం ఇడ్లీలకు దూరంగా ఉంటారు. కానీ ఇడ్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే సులువుగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు రావు. అందుకే చాలా మంది హోటల్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా దీన్నే తింటుంటారు. దీన్ని మన ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే వేడి వేడి ఇడ్లీలను తయారుచేసి తినొచ్చు.
ఇడ్లీను ఇడ్లీ రవ్వ, మినపప్పు లేదా బియ్యం, మినపప్పుతో తయారుచేస్తారు. ముఖ్యంగా హాట్ ఫ్రెష్ బన్నీ ఇడ్లీ టేస్ట్ అద్బుతంగా ఉంటుంది. అయితే చాలా మంది మిగిలిపోయిన ఇడ్లీలను మళ్లీ తినడానికని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల ఇడ్లీలను తిరిగి వేడి చేయడం కష్టంగా ఉంటుంది. కానీ మీరు కొన్ని పద్దతులను ఫాలో అయితే మాత్రం మీరు ఎలాంటి టెన్షన్, రిస్క్ తీసుకోకుండా చాలా సులువుగా అప్పుడే చేసిన ఇడ్లీల మాదిరిగా వీటిని వేడి చేయొచ్చు. దీనివల్ల అవి టేస్ట్ అస్సలు మారవు. అలాగే ఫ్రెష్ గా ఉంటాయి. మెత్తగా బాగుంటాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
undefined
చల్లగా అయిన ఇడ్లీలను ఎలా వేడి చేయాలి?
మొదటి పద్ధతి
ఎప్పుడో చేసిన ఇడ్లీలను తిరిగి వేడి చేయడానికి మీరు ఎంచక్కా స్టీమర్ ను ఉపయోగించొచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందుకోసం స్టీమర్ లోపల కొన్ని నీళ్లు పోసి అందులో ఇడ్లీలను ట్రే పై పెట్టండి. ఇప్పుడు స్టీమర్ ను మూసేసి కొద్ది సేపటి తర్వాత బయటకు తీసి చూడండి. వేడివేడి ఇడ్లీలు టేస్టీగా ఉంటాయి.
రెండో పద్దతి
రెండో పద్దతిలో మీరు చల్లగా అయిన ఇడ్లీలను మైక్రోవేవ్ ను ఉపయోగించి వేడి చేయొచ్చు. ఇందుకోసం మీరు మిగిలిన ఇడ్లీలను తీసుకుని మైక్రోవేవ్ లో ఒక గిన్నెలో పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్లు , నీళ్లను నింపిన చిన్న గిన్నె తీసుకోండి. ఈ గిన్నెపై ఇడ్లీ గిన్నెను పెట్టండి. ఒకవేళ గ్లాసు పెట్టడానికి మైక్రోవేవ్ లో స్థలం లేకపోతే ఇడ్లీలపై కొన్ని నీళ్లు చల్లి మైక్రోవేవ్ లో ఇడ్లీలను పెట్టండి. ఈ పద్దతిలో ఇడ్లీలు వేడివేడి, మెత్తగా అవుతాయి.
మూడో పద్దతి
మిగిలిపోయిన ఇడ్లీలను వేడి చేయడానికి మీరు నాన్ స్టిక్ పాన్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం కోసం మీరు ఒక పాన్ ను వేడి చేయండి. దీనిలో అన్ని ఇడ్లీలను పెట్టండి. ఆ తర్వాత పాన్ లో ఒక చెంచా నీళ్లను పోసి 1 నుంచి 2 నిమిషాల పాటు మూతపెడితే సరిపోతుంది.