బియ్యం నీటితో... ముఖం వెలిగిపోతుంది..!

By telugu team  |  First Published May 9, 2019, 4:41 PM IST

అన్నం వండటానికి ముందు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడుగుతాం. తర్వాత ఆ నీటిని పారబోస్తాం. ఆ పారబోసే నీటితో... మన అందాన్ని రెండింతలు చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. 


అన్నం వండటానికి ముందు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడుగుతాం. తర్వాత ఆ నీటిని పారబోస్తాం. ఆ పారబోసే నీటితో... మన అందాన్ని రెండింతలు చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖానికి తేజస్సు రావాలన్నా... వెంట్రుకలు అందంగా ఉండాలన్నా... ఈ బియ్యం నీరు బాగా ఉపయోగపడుతుందంటున్నారు.

బియ్యం శుభ్రంగా కడిగి కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం బాగా పిసికి, వడగట్టాలి. ఇలా సేకరించినవే బియ్యం నీరు. ఈ నీటిని వెంట్రుకలకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉంటుంది. కుదుళ్లు కూడా బలపడతాయి.

Latest Videos

ఆ బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే..  మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది. తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా మారుతుంది.బియ్యం నీటిలోని పోషకాల వల్ల చర్మం జీవం సంతరించుకుంటుంది. నునుపుగా, ఆరోగ్యవంతంగా మారుతుంది.చర్మం మీద దద్దుర్లు, మంటలు లాంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. 

click me!