గతేడాది మార్చి నెలతో పోలిస్తే 12% నియామకాలు పెరిగాయి. అందునా ఐటీ కొలువుల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. దీన్ని బట్టి జీఎస్టీ, నోట్ల రద్దుతో తలెత్తిన అనిశ్చితి నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నదన్న సూచనలు అందుతున్నాయి.
ముంబై: క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్త నియామకాలూ జోరందుకున్నాయి. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో పెరిగిన కొత్త నియామకాలే దీనికి నిదర్శనం. ఈ సంవత్సరం మార్చిల్లో మొత్తంగా చూస్తే దేశంలో ఉద్యోగ నియామకాలు 12 శాతం పెరిగాయి.
మార్చి నెలకు సంబంధించి నౌకరీ డాట్ కామ్ విడుదల చేసిన ‘ది నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్’ఈ సంగతి తెలిపింది. ఉద్యోగాల కోసం ఈ వెబ్‌సైట్‌లో నమోదయ్యే వ్యక్తుల వివరాల ఆధారంగా నౌకరీ.కాం ప్రతి నెల ఈ వివరాలు విడదుల చేస్తుంది.
ఐటీ రంగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు ఏకంగా 38 శాతం పెరిగాయి. ఆరు నెలలుగా ఈ రంగంలో నియామకాల జోరు పెరుగుతోంది.
undefined
2019 మార్చిలో బీపీఓ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) రంగంలోనూ నియామకాలు తొమ్మిది శాతం పెరిగాయి. నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాల నియామకాల్లో 13 శాతం వృద్ధి నమోదైంది.
మార్కెటింగ్, హెచ్‌ఆర్ విభాగాల్లో నియామకాలు 12 నుంచి 13 శాతం పెరిగాయి. 89 శాతం ఐటీ కంపెనీలు మాత్రం నియామకాల జోరు కొనసాగుతుందని అంటున్నాయి.
బీమాలో ఆరుశాతం, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ లో ఐదుశాతం, విద్యలో ఏడుశాతం, ఐటీ హార్డ్‌వేర్ రంగంలో మూడు శాతం నియామకాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అయితే బీమా, ఆర్థిక సేవల రంగాల్లో 15 శాతం నియామకాలు తగ్గిపోయాయి.
ఆటోమొబైల్ అనుబంధ రంగాల్లో నియామకాలు ఎనిమిది శాతం తగ్గాయి. కొత్త నియామకాల్లో బెంగళూరు, చెన్నై నగరాలు అగ్ర స్థానంలో నిలిచాయి. గతేడాది మార్చి నెలలో 2,129 మంది నియామకాలు జరిగితే గత నెలలో 2,378 మంది ఉద్యోగావకాశాలు లభించాయి.
ఏది ఏమైనా ఈ ఏడాది ప్రారంభం నుంచి నియామకాల జోరు పెరిగిందని వివిధ రంగాల నిపుణులు చెబుతున్నారు. నాలుగు నుంచి ఏడేళ్ల అనుభవం గల మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నది.
ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో 14 శాతం, మూడేళ్లలోపు అనుభవం గల ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు 12 శాతం పెరిగాయి. 8-12 ఏళ్ల అనుభవం గల మిడ్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగుల నియామకాలు తొమ్మిది శాతం, 13-16 ఏళ్ల అనుభవం గల వారికి నియామకాలు ఐదు శాతం పెరుగుతాయి.
మొత్తం నియామకాల్లో బెంగళూరు నగరంలో 18 శాతం పెరిగితే, చెన్నైలో 13 శాతం పెరిగింది. ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు నగరంలో నియామకాలు 49 శాతం వ్రుద్ధి చెందాయి. బీఎఫ్ఎస్ఐ ఇండస్ట్రీలో 49, ఆటో రంగంలో ఆరు శాతం నియామకాలు తగ్గాయి. ఐటీఈఎస్ విభాగంలో సానుకూలంగా ప్రత్యేకించి 24 శాతం గ్రోథ్ సాదించారు. నాలుగు నుంచి ఏడేళ్ల అనుభవం గల వారిలో 25 శాతం పురోగతి నమోదైందని నౌకరీ డాట్ కామ్ పేర్కొంది.