నేక్‌డ్ రిజిగ్నేషన్‌ అంటే ఏమిటి ? ఇలా చేశారంటే కెరీర్ రిస్క్‌లో పడ్డట్లే

By Arun Kumar PFirst Published Jul 9, 2024, 4:31 PM IST
Highlights

నేక్‌డ్ రిజిగ్నేషన్‌... ఇది ఉద్యోగి కెరీర్ ను రిస్క్ లో పెడుతుంది.  అసలు ఏమిటీ రిజిగ్నేషన్... ఇలా చేస్తే కెరీర్ ఎందుకు రిస్క్‌లో పడుతుంది..?

Naked Resignation : ఏ ఉద్యోగి అయినా ప్రస్తుతం చేస్తున్నదానికంటే మంచి జాబ్ వస్తేనో... కెరీర్ మరింత బాగుంటేనో... సాలరీ ఎక్కువగా వస్తేనో...  రాజీనామా చేస్తారు. అయితే పని ఒత్తిడితోనే లేదంటే ఇతర ఏ కారణాలతోనో మరోచోట అవకాశం రాకుండానే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మానెస్తుంటారు కొందరు. దీన్నే నేక్‌డ్ రిజిగ్నేషన్ (నగ్న రాజీనామా) అంటారు. 

అయితే.. ఇలా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. కానీ దీని ప్రభావం ఉద్యోగి భవిష్యత్తుపై పడుతుంది. దీనివల్ల ఆర్థికంగానే కాదు మరో ఉద్యోగం పొందేందుకు ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడూ ఇది దీర్ఘకాల నిరుద్యోగానికి దారితీయవచ్చు. కెరీర్‌లో గ్యాప్ రావడం వల్ల ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయి.  కాబట్టి ఇలా చేయడమంటే రిస్క్ చేయడమే అని చెప్పాలి.

Latest Videos

కాబట్టి వేతన జీవులు ఇలాంటి రాజీనామాకు దూరంగా ఉండాలి. ముందుగా మరో ఉద్యోగ అవకాశం వచ్చిన తర్వాతే ప్రస్తుత జాబ్‌ను వదులుకోవడం మంచిది. దీనివల్ల కెరీర్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సున్నితంగా ముందుకు సాగుతుంది. లేదంటే నేక్‌డ్ రిజిగ్నేషన్ వల్ల ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగి కెరీర్ ఇబ్బందికరంగా మారుతుంది.

click me!