నిరుద్యోగులకు లక్కీ ఛాయిస్... భారీ జాబ్స్ నోటిఫికేషన్, తెలుగు యువతకు స్పెషల్...

By Arun Kumar PFirst Published Jul 12, 2024, 6:39 PM IST
Highlights

బ్యాంకింగ్ రంగంలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం కల్పిస్తోంది ఇండియన్ బ్యాంక్.  జాబ్స్ వివరాలేంటో తెలుసుకొండి...

బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఉద్యోగావకాశం కల్పిస్తున్నారు. ఇలా 1500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఏదయినా డిగ్రీ పాసై వుండి... జూన్ 1, 2024  నాటికి 20 ఏళ్లలోపు వయసు వుంటే చాలు... ఈ బ్యాంకింగ్ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలిపు వుంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ వుంటుంది. ఇందులో ఎంపికైనవారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటి ఆధారంగానే ఫైనల్ ఎంపిక వుంటుంది. 

Latest Videos

ఈ బ్యాంకింగ్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఈ నెల 10న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ 31 జూలై, 2024 వరకు సాగనుంది. జనరల్ అభ్యర్థులకు రూ.500 దరఖాస్తు ఫీజు...ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు ఫీజు నుండి మినహాయింపు వుంది. 

ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ట్రైనింగ్ వుంటుంది. ఈ సమయంలో మెట్రో లేదా అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందినవారికి రూ.15వ వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో పనిచేసేవారికి రూ.12 వేల జీతం ఇవ్వనున్నారు. 

దేశవ్యాప్తంగా 1500 ఉద్యోగాల భర్తీ చేపట్టునుండగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో 124 పోస్టులున్నాయి. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా 82 వుండగా తెలంగాణలో 42 వున్నాయి. ఈ ఉద్యోగాలపై ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే  ఇండియన్ బ్యాంక్ అధికారిక పోర్టల్ indianbank.in విజిట్ చేయండి. 

click me!