Donald Trump: మోదీ చాలా స్మార్ట్ అని, తన బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ అన్నారు. భారత్ తో టారిఫ్ డీల్ గురించి అమెరికా ప్రెసిడెంట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే..
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం భారత్ తో టారిఫ్ డీల్ గురించి ఒక కామెంట్ చేశారు. మోదీ చాలా స్మార్ట్ అని, తన బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. మోదీ రీసెంట్ గా అమెరికా వచ్చారని, ఎప్పటి నుంచో తామిద్దరం మంచి స్నేహితులమని ట్రంప్ చెప్పారు. న్యూ జెర్సీలో అటార్నీ ఎలీనా హబ్బా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు, జర్నలిస్టులతో మాట్లాడుతూ మోదీని పొగిడారు, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు.
ట్రంప్ ఇంకా మాట్లాడుతూ, భారత్ ఎక్కువ టారిఫ్ లు వేసే దేశాల్లో ఒకటి అని, మోదీ చాలా స్మార్ట్ అని అన్నారు. తమ మధ్య మంచి చర్చ జరిగిందని, ఇండియా, అమెరికా సంబంధాలు బాగుంటాయని నమ్ముతున్నానని చెప్పారు. మీకు మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఇండియా-అమెరికా టారిఫ్ లు మంచి ఫలితాలు ఇస్తాయని ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ అన్నారు.
గురువారం ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేస్తూ, దిగుమతి చేసుకునే వెహికల్స్ మీద 25 పర్సెంట్ టారిఫ్ వేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇది దేశీయంగా తయారీని పెంచడానికి ఇది ఒక కీలక అడుగు అని అన్నారు. దీనికి ముందు, అమెరికా మీద భారత్ ఎక్కువ టారిఫ్ వేస్తుందని, వ్యాపారం చేయడానికి కష్టమైన ప్రదేశమని ఆరోపించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో భారత్, చైనా లాంటి దేశాల మీద పరస్పర టారిఫ్ లు వేస్తానని, అమెరికా ప్రొడక్ట్స్ మీద ఎంత టారిఫ్ వేస్తారో, అంతే టారిఫ్ ఆ దేశాల మీద వేస్తామని ట్రంప్ అనడం సంచలనంగా మారిన విషయం విధితమే.
| Washington, US: On India-US tariff talks, US President Donald Trump says, "Prime Minister Modi was here just recently, and we've always been very good friends. India is one of the highest tariffing nations in the world... They're very smart. He (PM Modi) is a very smart… pic.twitter.com/7O4adE7F9f
— ANI (@ANI)