మయన్మార్ లో ఇప్పటికే రెండుసార్లు భూకంపం సంభవించింది... అయితే మరోసారి భూకంపం సంభవించే అవకాశం ఉందా?
మయన్మార్ ను భారీ భూకంపం కుదిపేసాయి. శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించింది... దీంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే పెను విధ్వంసం జరిగిపోయింది. ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు భూకంపం సంభవించింది. మొదట అత్యధిక తీవ్రతతో భూమి కంపించింది... రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7 శాతంగా నమోదయ్యింది. రెండోసారి 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.
ఈ భూకంపం దాటికి ఇళ్లు కూలిపోయాయి... ప్రజలు ప్రాణాభయంతో రోడ్లపైకి పరుగు తీసారు. భారీ భవంతులు సైతం నేలకొరిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి... వంతెనలు కూలిపోయి చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ దెబ్బతింది. ఇలా మయన్మార్ లో సంభవించిన భూకంపం భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చింది... ప్రాణనష్టం కూడా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇప్పటికే భూకంపం సృష్టించిన విధ్వంసం చూసి మయన్మార్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ భవనాల నుండి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇలా రోడ్లపైకి జనాలు చేరడంతో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది.
ఇక ఈ భూకంప భీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుండగానే భారీ భవంతులు కుప్పకూలిపోయాయి... భయంతో జనాలు పరుగు తీసారు. ఇక రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో భారీగా ఆస్టినష్టం జరిగింది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం... ఈ భూకంప కేంద్రం సాగైంగ్ నుండి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో మెన్యువా నగర సమీపంలో ఉంది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తేల్చారు.
మొదట శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటలకు 7.7 తీవ్రతతో ఇక్కడ భూమి కంపించింది. కొద్దిసేపటికే మరోసారి ఇక్కడే 6.4 తీవ్రతతో మరో భూకంపం సంబవించింది. ఇలా వరుస భూకంపాల కారణంగా మయన్మార్ కు భారీ నష్టం వాటిల్లింది.