తెల్ల జుట్టు, చేతులకు సంకెళ్లు.. NIAకి అప్పగించే సమయంలో ముంబై దాడుల సూత్రదారి రాణా ఎలా ఉన్నాడో చూశారా?

26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వూర్ హుస్సేన్ రాణాను కాలిఫోర్నియాలో NIA బృందానికి, MEA ప్రతినిధులకు US మార్షల్స్ అప్పగించిన తొలి ఫోటోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరణహోమానికి కారణమై ఎంతో మంది అమాయకుల ప్రజల ప్రాణాలు తీసిన రాణాకు తగిన శాస్తి జరగాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tahawwur Rana Handover: First Images from US Marshals to NIA details in telugu VNR

కాలిఫోర్నియాలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ లో US మార్షల్స్ పాకిస్తాన్ జాతీయుడు, కెనడా పౌరుడు, 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి అయిన తహవ్వూర్ రాణా సంరక్షణను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధులకు మంగళవారం అప్పగించారు. కాలిఫోర్నియాలో తహవ్వూర్ హుస్సేన్ రాణాను NIA బృందానికి, MEA ప్రతినిధులకు US మార్షల్స్ అప్పగించిన ఫోటోలు బయటకొచ్చాయి. 64 ఏళ్ల రాణాను US మార్షల్స్ సైనిక స్థావరంలాంటి ప్రదేశంలో సంకెళ్లతో తీసుకెళ్తున్నట్లుగా విజువల్స్ లో ఉంది.

US Marshals in the Central District of California on Tuesday transferred custody of Tahawwur Rana, a Pakistani national and Canadian citizen, to representatives from India’s Ministry of External Affairs.

Tahawwur Rana is now in NIA custody for 18 days, during which time the… pic.twitter.com/vWBcl9vGWQ

— ANI (@ANI)

US నుంచి రప్పించిన తర్వాత తహవ్వూర్ రాణా గురువారం ఢిల్లీకి చేరుకున్నాడు. రాణా రాగానే NIA అరెస్టు చేసింది. ప్రత్యేక కోర్టు 18 రోజుల పాటు ఏజెన్సీ కస్టడీకి పంపింది. తెల్ల జుట్టు, గడ్డంతో బ్రౌన్ దుస్తుల్లో రాణా పాలం విమానాశ్రయంలో కనిపించాడు. 2008 దాడుల వెనుక ఉన్న కుట్రను పూర్తిగా తెలుసుకోవడానికి రాణాను 18 రోజుల పాటు NIA కస్టడీలో ప్రశ్నిస్తారు. ఈ దాడిలో మొత్తం 166 మంది చనిపోయారు, 238 మందికి పైగా గాయపడ్డారని NIA తెలిపింది.

Latest Videos

26/11 ముంబై దాడుల్లో నిందితుడైన తహవ్వూర్ రాణా పంపిన ఈమెయిల్స్ సహా బలమైన సాక్ష్యాలను NIA కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో లోతైన విచారణ జరపడానికి రాణాను కస్టడీలోకి తీసుకోవడం చాలా అవసరమని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. రాణా పాత్రను కూడా పరిశీలిస్తామని తెలిపారు. డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ, లష్కరే తోయిబా (LeT), హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ (HUJI) ఉగ్రవాద సంస్థల సభ్యులతో కలిసి రాణా కుట్ర పన్నాడని NIA తెలిపింది. ఇండియాకు రాకముందు హెడ్లీ మొత్తం ఆపరేషన్ గురించి రాణాతో మాట్లాడాడు. ఏమైనా సమస్యలు వస్తే తన వస్తువులు, ఆస్తుల గురించి రాణాకు మెయిల్ పంపాడు. ఇలియాస్ కశ్మీరీ, అబ్దుర్ రెహ్మాన్ ల ప్రమేయం గురించి కూడా రాణాకు చెప్పాడు.

రాణా రప్పించడంపై NIA ఏం చెప్పిందంటే?

26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి రాణాను రప్పించడంలో NIA విజయం సాధించింది. 2008లో జరిగిన మారణహోమానికి కారకుడైన వ్యక్తిని న్యాయం ముందు నిలబెట్టడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని NIA గురువారం తెలిపింది. రాణాను ఇండియాకు పంపడానికి ఇండియా-US ఒప్పందం ప్రకారం USలో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. ఇండియాకు రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎట్టకేలకు రాణాను NIA భారత్ కు రప్పించింది. డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ, లష్కరే తోయిబా (LeT), హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ (HUJI) ఉగ్రవాద సంస్థలతో కలిసి రాణా 2008లో ముంబైలో దాడులు చేయడానికి కుట్ర పన్నాడని NIA తెలిపింది. ఈ దాడిలో 166 మంది చనిపోయారు, 238 మందికి పైగా గాయపడ్డారు. LeT, HUJIలను భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.


vuukle one pixel image
click me!