అందుకే శ్రీలంకలో బాంబు పేలుళ్లు:రక్షణ మంత్రి

By narsimha lodeFirst Published Apr 23, 2019, 3:16 PM IST
Highlights

న్యూజిలాండ్‌లోని ఓ మసీదులో ఇటీవల జరిగిన బాంబు దాడులకు ప్రతీకారంగానే  ఇస్లామిక్ ఉగ్రవాదులు  శ్రీలంకలో బాంబు దాడులకు పాల్పడ్డారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్ధనే తెలిపారు.


కొలంబో: న్యూజిలాండ్‌లోని ఓ మసీదులో ఇటీవల జరిగిన బాంబు దాడులకు ప్రతీకారంగానే  ఇస్లామిక్ ఉగ్రవాదులు  శ్రీలంకలో బాంబు దాడులకు పాల్పడ్డారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్ధనే తెలిపారు.

శ్రీలంక రాజధాని కొలంబోలో  ఆదివారం నాడు చర్చిలు, విలాసవంతమైన హోటళ్లను లక్ష్యంగా చేసుకొని  వరుసగా 8 దఫాలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 310 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 500కు పైగా గాయపడ్డారు.

వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ శ్రీలంక మంత్రి మంగళవారం నాడు పార్లమెంట్‌లో ఈ విషయాలను వెల్లడించారు.న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

శ్రీలంకలో పేలుళ్లు: 310 మంది మృతి, 40 మంది అరెస్ట్

శ్రీలంక పేలుళ్లు: ఒక చోట తప్పించుకున్నా.. మరోచోట బలి

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

click me!