ప్ర‌ధాని మోదీని క‌లిసిన భూట‌న్ రాజు.. ఇరుదేశాల మ‌ధ్య కీల‌క ఒప్పందం

By Rajesh KarampooriFirst Published Sep 14, 2022, 4:34 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ను కలిశారు. అదే స‌మ‌యంలో విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను కూడా కలిశారు. భూటాన్ మంగళవారం అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఆమోదించింది.
 

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్‌గ్యాల్ వాంగ్‌చుక్ త‌న‌ భారత పర్యటన భాగంగా బుధ‌వారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అంతకుముందు భార‌త‌ విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రాతో భూటాన్ రాజు భేటీ అయ్యారు. అలాగే ఆయ‌న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కూడా కలవనున్నారు. అంతకుముందు మంగళవారం, భూటాన్ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసింది.

భారత్‌లోని భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెస్టాప్ నామ్‌గ్యాల్ ఒప్పంద పత్రాలను సెక్రటరీ ఈఆర్ దమ్ము రవికి అందజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ సమయంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డిజి కూడా ఉన్నారు.

భారత్, భూటాన్ మధ్య అత్యంత ముఖ్యమైన ఒప్పందం స్నేహం, సహకారం. 1949 నుంచే ఇరుదేశాల మధ్య స్నేహా సంబంధాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని, అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం 2007లో సవరించబడింది.

భారత్-భూటాన్‌ల మధ్య అనేక రంగాల్లో సహకారం 

తన విదేశాంగ విధానానికి సంబంధించి భారత్‌కు మార్గనిర్దేశం చేయగలదని భూటాన్ అంగీకరించింది. అటువంటి పరిస్థితిలో రెండు దేశాలు విదేశీ, రక్షణ రంగానికి సంబంధించిన విషయాలపై చ‌ర్చించారు.  రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 1968లో ఏర్పడ్డాయి. ఆ సమయంలో థింఫులో భారతదేశం యొక్క ప్రత్యేక కార్యాలయం ప్రారంభించబడింది. భారత్, భూటాన్ మధ్య అనేక సంస్థాగత, దౌత్యపర విష‌యాల‌పై ఒప్పందాలు జ‌రిగాయి.  భద్రత, సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, రవాణా, ఆర్థిక, జలవిద్యుత్ మరియు నీటి వనరుల విభాగాల్లో ఉన్నాయి.

భూటాన్ భారతదేశానికి వ్యూహాత్మకం 

భూటాన్ తన సరిహద్దును భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలతో పంచుకుంటుంది. వీటిలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం ఉన్నాయి. చైనాను చూస్తే.. భూటాన్ భారతదేశానికి ముఖ్యమైన దేశం. చికెన్ నెక్ కారిడార్‌ను సురక్షితంగా ఉంచాలనేది ఇరు దేశాల‌ ఉద్దేశ్యం. చికెన్ నెక్ కారిడార్‌ను సిలిగురి కారిడార్ అని కూడా అంటారు. ఇది 22 కిమీ ఇరుకైన ప్రాంతం. ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉంది. అదే సమయంలో.. భారత్, భూటాన్ ల మ‌ధ్య వాణిజ్యం, రవాణా ఒప్పందం ఆధారంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుంది. ఈ మేర‌కు 1972లో ఒప్పందం జరిగింది. అలాగే.. కరోనా కాలంలో.. కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్‌ను భార‌త్ బహుమతిగా మొదటి సారి భూటాన్ దేశానికే  ఇచ్చింది.

click me!