ఫేస్‌బుక్‌లో ఛాటింగ్: మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక.. తీరా చూస్తే

By Siva KodatiFirst Published Oct 14, 2019, 5:52 PM IST
Highlights

జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు.

చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతోన్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ద్వారానే ఈ అకృత్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే ఒక పోలీస్ అధికారి కైలీ అనే బాలిక పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్ చేశాడు. తన వయసు 14 ఏళ్లని, విస్కాన్సిన్‌లోని నిన్హా ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.

అలా తన అకౌంట్ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన టామీ లీ జెంకిన్స్ సదరు రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. కొద్దిరోజుల పరిచయం తర్వాత జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు.

దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు.

ప్రయాణంలోని వివిధ ప్రాంతాల్లో దిగిన ఫోటోలను కైలీకి పంపించాడు. జెంకిన్స్‌ను నిశితంగా గమనిస్తున్న అధికారులు నిన్హాకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికను ప్రేరేపించడం, ప్రలోభపెట్టినందుకు గాను జెంకిన్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అలా మైనర్ బాలికతో శృంగారం కోసం జెంకిన్స్ 565 కిలోమీటర్లు నడిచి చివరికి బొక్కబొర్లాపడ్డాడు. ఈ నెల 23న అతనిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో దోషిగా తేలితే.. జెంకిన్స్‌కు 10 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశముంది. 
 

click me!