డిన్నర్‌కు పిలిచి ఫ్రెండ్‌పై రేప్

By narsimha lodeFirst Published Feb 12, 2019, 12:45 PM IST
Highlights

తనను పరిచయమైన యువతిని డిన్నర్‌కు పిలిచి ఆమెపై కారులో రెండు దఫాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకొంది.


దుబాయ్: తనను పరిచయమైన యువతిని డిన్నర్‌కు పిలిచి ఆమెపై కారులో రెండు దఫాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకొంది.  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పిర్యాదు ఆధారంగా  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దుబాయ్‌లోని అల్ అయిన్ ప్రాంతంలో నివాసముంటున్న ఫిలిఫైన్స్‌కు చెందిన మహిళకు వాట్సాప్‌లో నెల రోజుల క్రితం ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమెను డిన్నర్‌కు రావాలని  అతను ఆమెను ఆహ్వానించాడు. అతడి ప్రపోజల్‌కు ఆమె అంగీకరించింది.

ఇద్దరు కలిసి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. బాధితురాలిని ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారులో  నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.  కారులోనే ఆమెపై  రెండు దఫాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన స్నేహితురాలితో  కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

ఇదిలా ఉంటే నిందితుడు తాను బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడలేదన్నారు. బాధితురాలే  తనను ముద్దు పెట్టుకొందని నిందితుడు  పోలీసులకు ఫోటోలు చూపాడు. అయితే ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలుగా  పోలీసులు గుర్తించారు.
 

click me!