400 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ దేశంగా బార్బడోస్ అవతరణ.. నేషనల్ హీరోగా రిహానా

By telugu teamFirst Published Nov 30, 2021, 4:43 PM IST
Highlights

సుమారు 400 ఏళ్ల తర్వాత కరీబియన్ దీవి దేశం బార్బడోస్ నూతన గణతంత్ర దేశంగా మంగళవారం ఆవిర్భవించింది. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ పాలన నుంచి వారు తప్పుకున్నారు. స్వయంగా ప్రెసిడెంట్‌ను ఎన్నుకున్నారు. దీంతో బార్బడోస్ నూతన గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 1625లో తొలిసారి బ్రిటన్ ఓడలు బార్బడోస్‌లో అడుగు పెట్టాయి. ఆ తర్వాత బార్బడోస్‌లో స్లేవ్ సొసైటీని నడిపాయి.

న్యూఢిల్లీ: ప్రపంచంలో నూతన రిపబ్లిక్ దేశంగా బార్బడోస్(Barbados) అవతరలించింది. సుమారు 400 ఏళ్ల తర్వాత బ్రిటీష్ కాలనీ నుంచి ఒక రిపబ్లిక్(Republic) దేశంగా మంగళవారం అవతరలించింది. బార్బడోస్ హెడ్‌గా బ్రిటన్ రాణి(Britain Queen) రెండో ఎలిజబెత్‌ను తొలగించి  యంగా ప్రెసిడెంట్‌నూ ఎన్నుకున్నారు. ఈ దేశ తొలి ప్రెసిడెంట్ మహిళ కావడం గమనార్హం. డేమ్ సాండ్రా ప్రునెలా మాసన్ తొలి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాదు, నేషనల్ హీరోగా పాప్ సింగ్ రిహానాను ఎంచుకున్నారు. భారత రైతాంగ పోరాటానికి మద్దతుగా ట్వీట్లు చేసి అంతర్జాతీయంగా దుమారం రేపిన రిహానా ఇప్పుడు బార్బడోస్ నేషనల్ హీరోగా ఎంపికయ్యారు.

ప్రిన్స్ చార్లెస్ హాజరైన అట్టహాస కార్యక్రమంలో రెండో ఎలిజబెత్‌ను దేశ సర్వాధికారిగా తొలగించారు. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షురాలిగా డేమ్ సాండ్రా ప్రునెలా మాసన్‌ను ప్రకటించారు. ఈ కరీబియన్ దీవి పార్లమెంటు ఉభయ సభలు, స్పీకర్ సంయుక్తంగా ఆమెను అధ్యక్షురాలిగా ప్రకటించారు.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

1625లో బ్రిటీష్ ఓడలు ఈ కరీబియన్ దీవి దేశం వచ్చాయి. అప్పటి నుంచి కరీబియన్ ప్రజలను ఒక బానిస సమాజంగా మార్చారు. 1996 నవంబర్ 30నే బార్బడోస్ స్వాతంత్రం పొందింది. అయినప్పటికీ ఆ దేశం 54 దేశాల కామన్వెల్త్ జాబితాలోనే ఉండిపోయింది. కొన్ని దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం నుంచి రాజ్యాంగ బద్ధ దేశంగా మారాలనే చర్చ ఈ దేశంలో జోరుగా సాగుతున్నది. వీటిపై కమిటీలు వేసి అధ్యయనాలు జరిగాయి. తొలుత చాలా మంది రాణి పాలన వైపే మొగ్గారని కమిటీ నివేదిక వచ్చినా, తదుపరి దశాబ్దంలో అందుకు విరుద్ధమైన అధ్యయనాలు వచ్చాయి. చివరికి, బ్రిటన్ రాణి పాలన నుంచి స్వయం పాలిత దేశంగా మారాలని ప్రజలు బలంగా నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే నేటి రిపబ్లిక్ బార్బడోస్.

ఈ ఉత్సవాన్ని దేశంలో అర్ధరాత్రి క్యాపిటల్ బ్రిడ్జీటౌన్‌లో చాంబర్లీన్ బ్రిడ్జీ దగ్గర వందలాది మంది గుమిగూడి అరుపులు, కేకలతో వేడుక చేసుకున్నారు. 21 గన్ ఫైరింగ్‌తో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే, రిపబ్లిక్‌గా మారిన తర్వాత కూడా జెండా, భద్రతా బలగాల యూనిఫామ్, జాతీయ ప్రతిజ్ఞ, గీతాలను మార్చడం లేదు. అయితే, రాయల్, క్రౌన్ అనే పదాలకు స్వస్తి పలకనున్నారు. ఉదాహరణకు రాయల్ బార్బడోస్ పోలీసు ఫోర్స్ ఇకపై బార్బడోస్ పోలీసు ఫోర్స్‌గా పిలవబడుతుంది.

బార్బడోస్ చరిత్ర బానిస వ్యాపారంలో కీలకంగా ఉన్నది. బ్రిటీష్ ప్రభుత్వం ఇక్కడి సమాజాన్ని ఒక బానిస సమాజంగా మార్చినట్టు అక్కడి కార్యర్తలు ఆరోపించారు. అసలు ఈ వేడుకకు బ్రిటీష్ రాణి తరఫున ప్రిన్స్ చార్లెస్ హాజరు కావడాన్ని వ్యతిరేకించారు. తొలుత, పత్తి, పొగాకు, పంచదార వంటి వాటిని కొల్లగొట్టారని, ఆ తర్వాత దీన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఒక లాభసాటి బానిస సమాజంగా వినియోగించుకుందని మండిపడ్డారు. 1627 నుంచి 1833 మధ్య కాలంలో బార్బడోస్‌కు సుమారు ఆరు లక్షల మంది బానిసలను ఆఫ్రికన్ నుంచి తరలించారని, వారిని బార్బడోస్‌లో గొడ్డు చాకిరి చేయించారని తెలిపారు. స్థానికులూ బానిసలుగా మారారని పేర్కొన్నారు. ఇప్పుడు వారందరికీ పరిహారం చెల్లించాలనే డిమాండ్ కూడా వినిపించింది.

click me!