మూడు పురుషాంగాలతో చిన్నారి జననం..!

By telugu news teamFirst Published Apr 8, 2021, 2:58 PM IST
Highlights

బిడ్డ కడుపులో ఉండగా.. తల్లి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని.. అయితే.. ఈ శిశువు విషయంలో అలాంటిదేమీ జరగలేదని వైద్యులు పేర్కొన్నారు. 

ఇరాక్ లో వింత శిశువు జన్మించింది. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో వింత శిశువులు జన్మించారు. అంటే శరీరంలో ఉండాల్సిన అవయవాలకన్నా.. ఎవైనా ఎక్కువగా ఉంటే.. మనం వింత శిశువు అంటాం.  కాగా.. ఇప్పటి వరకు చేతులు, కాళ్లు, తల ఇలాంటి భాగాలు ఎక్కువగా ఉండి.. శిశువులు జన్మించిన వార్తలను మనం విన్నాం. అయితే.. తాజాగా.. ఇరాక్ లో ఓ చిన్నారి మూడు పురుషాంగాలతో జన్మించాడు.

ఒకదానికొకటి అతుక్కొని మూడు పురుషాంగాలతో కలిసి శిశువు జన్మించినట్లు గుర్తించారు.  కాగా.. శిశువుని చూసి వైద్యులు సైతం షాకయ్యారు. ఇది చాలా రేర్ కేసు అని వైద్యులు పేర్కొన్నారు.  జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరిరగి ఉంటుందని వైద్యులు తెలిపారు.

బిడ్డ కడుపులో ఉండగా.. తల్లి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని.. అయితే.. ఈ శిశువు విషయంలో అలాంటిదేమీ జరగలేదని వైద్యులు పేర్కొన్నారు. 

6 మిలియన్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తుంటాయని.. కేవలం జన్యుపరమైన లోపం కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.


 

click me!