సరస్సులో బోటు ప్రమాదం, 178 మంది గల్లంతు

First Published Jun 20, 2018, 3:25 PM IST
Highlights

గల్లంతయిన వారంతా పర్యాటకులే...

ఇండోనేషియా లో ఘోర ప్రమాదం సంభవించింది. సామర్థ్యానికి మించి పర్యాటకులను తీసుకు వెళుతున్న ఓ బోటు సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలొ దాదాపు 178 మంది గల్లంతయ్యారు. 

సుమత్రా దీవుల్లోని లేక్ తోబా సరస్సులో ఈ ప్రమాదం సంభవించింది. కేవలం 80 మందిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం గల కట్టె బోటులో ఏకంగా దాదాపు 200 మంది పర్యాటకులను తీసుకెలుతుండగా ప్రమాదం జరిగింది. అంటే సామర్థ్యం కంటే మూడు రేట్లు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ సరస్సు లోతు కూడా దాదాపు 450 మీటర్ల లోతు ఉంది. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

 రంజాన్ పండగ సంబరాల నేపథ్యంలో బారీ స్థాయిలో పర్యాటకులు తమ కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడపడానికి వచ్చారు. దీంతో బోట్ల వాళ్లు ఎక్కువ డబ్బులు వస్తాయని సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారు. దీంతో ప్రమాదం సంభవించింది.

ప్రస్తుతం సుమత్రా దీవుల్లో ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కల్గుతోంది. ఇపపటివరకు కేవలం 18 మంది ప్రయాణికులను మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగారు. బోటులోనే అనేక మంది ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.  

గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 25 మంది డైవర్లు, సహాయక సిబ్బంది సాయంతో అదృశ్యమైనవారి కోసం అన్వేషిస్తున్నారు.
 

click me!