చైనాలో విషాదం: బోగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం

By Siva KodatiFirst Published Sep 27, 2020, 4:07 PM IST
Highlights

చైనాలో దారుణం జరిగింది. భూగర్బ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు ప్రాణాలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

చైనాలో దారుణం జరిగింది. భూగర్బ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు ప్రాణాలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

నైరుతి చైనాలోని ఈ గనిలో కన్వేయర్‌ బెల్ట్‌ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలైందని, దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని అధికారులు ప్రకటించారు.

అయితే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియాల్సి వుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్‌ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. కాగా, ప్రమాదం జరిగిన చోఘింగ్‌ ఎనర్జీ సంస్థ ప్రభుత్వం అధీనంలో నడుస్తోంది. 

చైనాలో బొగ్గు గనుల్లో ప్రమాదాలు సాధారణమైపోయాయి. భద్రతా పరమైన నిఘా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకులు మరణిస్తున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన ఓ బొగ్గుగని, గ్యాస్‌ పేలుడు ఘటనలో 14 మంది మైనర్లు మృతి చెందారు.

2018 డిసెంబర్‌లో ఇదే చోఘింగ్‌ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్లు మృతి చెందారు. 2018 అక్టోబర్‌లో షాన్‌డోంగ్‌ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో 21 మంది మైనర్లు ప్రాణాలు విడిచారు.

నాటి ప్రమాదంలో బొగ్గుగనిలో బొగ్గు పెళ్లలు విరిగిపడటంతో బయటకు రాలేక 22 మంది చిక్కుకు పోయారు. వీరిలో ఒకరిని మాత్రమే సహాయక బృందాలు రక్షించగలిగాయి.

click me!