Health tips: నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Published : May 30, 2025, 12:52 PM IST
Health tips: నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

సారాంశం

కొన్ని ఆహారాలు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. వాటిలో పెరుగు, నిమ్మరసం కూడా ఉంది. మరి వీటిని ఎందుకు కలిపి తినకూడదు? తింటే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

నిమ్మరసం, పెరుగు విడివిడిగా చూస్తే రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని కలిపి తీసుకుంటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

పెరుగులోని పోషకాలు:

పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. అంతేకాదు పెరుగు మెరుగైన జీర్ణవ్యవస్థకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం, పెరుగు ఎందుకు కలిపి తినకూడదు?

జీర్ణ సమస్యలు:

నిమ్మరసం ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. పెరుగు ఒక పాల ఉత్పత్తి. ఈ రెండింటినీ కలిపినప్పుడు.. పెరుగులోని ప్రోటీన్లు సిట్రిక్ యాసిడ్ ప్రభావంతో గడ్డకడతాయి. దీనివల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణవ్యవస్థలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి గుండెల్లో మంట, అసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

పోషకాల శోషణ తగ్గుతుంది:

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కాల్షియంతో కలిసి కరగని సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల శరీరం కాల్షియంను సమర్థవంతంగా గ్రహించలేకపోతుంది. ఇదే విధంగా ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాల శోషణ కూడా ప్రభావితం కావచ్చు.

అలెర్జీలు:

కొంతమందికి నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకున్నప్పుడు అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. చర్మంపై దురద, విరేచనాలు, వాంతులు లేదా కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా రావచ్చు.

ఆయుర్వేదం ప్రకారం:

ఆయుర్వేదం ప్రకారం… నిమ్మరసం వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. పెరుగు చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ రెండు వ్యతిరేక గుణాలు. ఈ ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల అలెర్జీలు, చర్మ సమస్యలు, కీళ్ల నొప్పుల వంటివి రావచ్చు.

ఎవరు అస్సలు తినకూడదు?

- పేగుల వాపు, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు పెరుగు, నిమ్మరసాన్ని కలిపి అస్సలు తీసుకోకూడదు.

- నిమ్మరసం లేదా పెరుగు అలెర్జీ ఉన్నవారు వీటిని కలిపి తినకూడదు.

- రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా వీటిని కలిపి తినడం మంచిది కాదు .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Health Tips: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Health Tips: భోజనం చేసిన తర్వాత టీ తాగుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!