
ఒత్తిడి మన నిత్యజీవితంలో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. పని లేదా కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు వంటివి మన శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి మానసిక సమస్యలనే కాదు.. శారీరక సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే కొన్నిఆహారాలు ఒత్తిడిని నియంత్రించడానికి బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఓట్ మీల్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా కొన్ని రకాల ఆహారాలు ఒత్తిడిని పెంచే కార్టిసాల్, ఆడ్రినలిన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ హార్మోన్లు దీర్ఘకాలికి ఒత్తిడికి దారితీస్తాయి. అందుకే ఈ హార్మోన్లను తగ్గించే ఆహారాలను తీసుకోవాలి. అవేంటంటే..
నారింజ
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను బాగా నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక రక్తపోటు పేషెంట్లపై జరిపిన ఒక అధ్యయనంలో.. ఒత్తిడితో కూడిన పనికి ముందు విటమిన్ సి ని తీసుకున్నప్పుడు రక్తపోటు బాగా తగ్గుతుంది. అలాగే కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు కూడా చాలా త్వరగా సాధారణ స్థితికి వచ్చాయని కనుగొన్నారు.
బ్లాక్ టీ
బ్లాక్ టీతో ఒక్కటేమిటీ.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ టీని తాగడం వల్ల ఒత్తిడి నుంచి త్వరగా బయటపడతారు. ఒక అధ్యయనం 4 వారాల పాటు రోజుకు 6 కప్పుల టీ ని తాగిన వ్యక్తులను తాగని వ్యక్తులతో పోల్చింది. అయితే టీ తాగేవారు ఇతరుల కన్నా ప్రశాంతంగా ఉన్నారని, ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ స్థాయిలను తక్కువ కలిగి ఉన్నారని నివేదించారు.
విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఒత్తిడి నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. గొడ్డు మాంసం, కోడి మాంసం, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలు, పోషక ఈస్ట్, అవయవ మాంసాల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది.
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు
మెగ్నీషియం కూడా మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యలను నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ఇది ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అవోకాడోలు, అరటిపండ్లు, బ్రోకలీ, డార్క్ చాక్లెట్, గుమ్మడికాయ గింజలు, బచ్చలి కూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
చిలగడదుంపలు
చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కార్బ్ ఆహారాలు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. కార్టిసాల్ స్థాయిలను మొత్తంగా నియంత్రించినప్పటికీ.. దీర్ఘకాలిక ఒత్తిడిని కలిగించే అవకాశం లేకుండా కార్టిసాల్ పనిచేయకపోవడానికి దారితీస్తుంది కూడా. ఇది మంట, నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
గుడ్లు
గుడ్లలో ఇతర ఆహారాల్లో లేనటువంటి పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని మల్టీ విటమిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. రోజుకో గుడ్డును తింటే మీ ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఒత్తిడి ప్రతిస్పందనకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుడ్లలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి.