కంటిచూపు బాగుండాలంటే ఈ పానీయాలను తప్పకుండా తాగండి..

Published : Feb 10, 2023, 02:06 PM IST
కంటిచూపు బాగుండాలంటే ఈ పానీయాలను తప్పకుండా తాగండి..

సారాంశం

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే శరీరంలో పోషక లోపం ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కంటిచూపు తగ్గుతుంది. ఎన్నో కంటి సమస్యలు కూడా వస్తాయి. 

పంచేంద్రియాలలో కళ్ళు అత్యంత అందమైన, సున్నితమైన అవయవం. కళ్లు లేకుండా ఎలా బతుకుతామో ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదా. అందుకే కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంటి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, టీవీలను మితిమీరి వాడుతున్నారు. వీటివల్ల కంటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. వీటిని అతిగా వాడితే గుడ్డి వారు అవుతారని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు మన శరీరలో పోషకాలు లేకపోవడం వల్ల కళ్ళు అనారోగ్యానికి గురవుతాయి. అలాగే కంటి చూపు తగ్గుతుంది.  ప్రభావితం చేస్తాయి. అందుకే మన శరీరంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. కంటి ఆరోగ్యాన్న మెరుగుపరచడానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయంటే..

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కాలాలతో సంబంధం లేకుండా తాగొచ్చు. ఈ జ్యూస్ లో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

క్యారెజ్ జ్యూస్

క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. క్యారెట్ జ్యూస్ కంటి చూపును పెంచడానికి, కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ జ్యూస్ లో విటమిన్ ఎతో పాటుగా, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బీట్ రూట్ జ్యూస్

బరువు తగ్గడం నుంచి అధిక రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం వరకు బీట్ రూట్ ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బీట్ రూట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, మాంగనీస్ ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ బి, ఎ, సి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఆపిల్ జ్యూస్

ఆపిల్ జ్యూస్ కూడా మన శరీరానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్లు, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆపిల్ రసం కంటి చూపును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. 

బచ్చలికూర

బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బచ్చలికూర రసం కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ రసం మన శరీర మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

టమాటా జ్యూస్

టమాటా జ్యూస్ బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, బాడీ హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. టమోటా జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం