నిమ్మకాయ ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా?

Published : Feb 10, 2023, 02:52 PM IST
నిమ్మకాయ ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా?

సారాంశం

నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో విటమిన్ సి తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరడంతో పాటుగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాదు.. 

నిమ్మకాయలను కాలాలతో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్, కాల్షియం, థయామిన్, పాంతోతేనిక్ ఆమ్లం, ఫోలేట్, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఔషద గుణాలున్న నిమ్మకాయలను ప్రతిరోజూ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమైపోతాయి. అవేంటంటే..

గుండె ఆరోగ్యానికి మంచిది

నిమ్మకాయలు విటమిన్ సి కి, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఈ రెండు పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ ను నివారించడానికి సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నారు. అయినప్పటికీ నిమ్మకాయలో ఉన్న ఫైబర్ గుండె జబ్బులకు దారితీసే కొన్ని ప్రమాద కారకాలను బాగా తగ్గిస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

నిమ్మ రోగనిరోధక శక్తిని పెంచే పండు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే దీనిలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది జలుబు, ఫ్లూకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి తాగితే దగ్గు, జలుబు తొందరగా తగ్గిపోతాయి. 

బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది

నిమ్మకాయలు కూడా బరువును తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కరిగే పెక్టిన్ ఫైబర్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇది మీకు ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే చాలా మంది నిమ్మకాయలను పూర్తిగా తినరు. గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని చాలా మంది అంటుంటారు. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది

నిమ్మకాయల తొక్క, గుజ్జులో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కాలేయంలో జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు క్రమబద్ధతను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అలాగే మలబద్దకం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 

చర్మానికి మంచిది

నిమ్మకాయల్లో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. నిమ్మకాయను నెత్తికి అప్లై చేయడం వల్ల నెత్తి ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం