3. మొహమాట పడకుండా 'నో' చెప్పాలి..
అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతామనే విషయం తెలుసుకోవాలి. తమ ఎదుగుదలకు లేదా ప్రశాంతతకు అడ్డు వచ్చే ఏ విషయాన్నైనా, ఎలాంటి అపరాధ భావం (Guilt) లేకుండా నిర్మొహమాటంగా తిరస్కరించడం నేర్చుకోవాలి..
4. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకూడదు..
మానసిక స్థైర్యం గల మహిళలకు కడుపుబ్బరం లేదా కుళ్లు ఉండదు. ఇతరులు విజయం సాధించినప్పుడు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు. పక్కవారి ఎదుగుదల తమకు స్ఫూర్తినిస్తుందే తప్ప, భయాన్ని కలిగించదు.
5. తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి..
ఏదైనా పని విఫలమైనప్పుడు పరిస్థితులను లేదా ఇతరులను నిందించకూడదు. తమ తప్పులకు తామే బాధ్యత వహించాలి. ఓటమిని ఒక అంతిమ నిర్ణయంగా కాకుండా, గెలుపుకు అవసరమైన ఒక పాఠంగా భావించాలి.
ఈ లక్షణాలను అలవరుచుకుంటే.. మానసికంగా బలంగా మారడమే కాదు... జీవితంలో గొప్ప స్థాయికి కూడా వెళతారు.