కడుపుతో ఉండి హీల్స్ వేసుకున్న దీపిక.. అలా వేసుకోవచ్చా..?

First Published | Jun 20, 2024, 1:45 PM IST

అసలు కడుపుతో ఉన్నవారు హీల్స్ వేసుకోవచ్చా..? వేసుకుంటే ఏహౌతుంది..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

గర్భం దాల్చడం ప్రతి స్త్రీకి  ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పొచ్చు. ఆ సమయంలో బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె... కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరయ్యారు. అయితే.. ఆ సమయంలో ఆమె.. హై హీల్స్ ధరించారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

చాలా మంది.. నెటిజన్లు.. ఆ ఫోటోలు చూసి.. దీపికాను విమర్శించారు. దారుణంగా ట్రోల్ చేయడం గమనార్హం. కడుపుతో ఉండి హీల్స్ వేసుకుంటావా..  అంటూ విమర్శించారు.  ఈ క్రమంలో.. అసలు కడుపుతో ఉన్నవారు హీల్స్ వేసుకోవచ్చా..? వేసుకుంటే ఏహౌతుంది..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..


సాధారణంగా అమ్మాయిలకు హై హీల్స్  వేసుకోవడం బాగా నచ్చుతుంది. కానీ.. గర్భం దాల్చినప్పుడు మాత్రం వేసుకోకుండా ఉండటమే మంచిదట.
అలా చేయడం వల్ల గర్భం మరింత కష్టతరం కావడానికి అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఒకవేళ హై హీల్స్ ధరిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో చూద్దాం....

high heels

వెన్నునొప్పి: హై హీల్స్ మీ భంగిమను ప్రభావితం చేస్తాయి. వాటిని ఎక్కువ కాలం ధరించడం వల్ల మీ కటి కండరాలు ముందుకు మడవగలవు. ఇది సంభవించినప్పుడు, మీరు వెనుక నుండి భారీగా ముందుకు వంగి ఉంటారు. గర్భం వేగంగా బరువు పెరగడానికి కారణమవుతుంది, ఇది భంగిమను మరింత ప్రభావితం చేస్తుంది. హైహీల్స్ నడుము నొప్పి త్వరగా తీవ్రమయ్యేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో, ఇది దిగువ వీపు, కాళ్ళలోని స్నాయువులతో కూడా ఇబ్బందులను సృష్టిస్తుంది.

Before wearing high heels...

కాళ్లలో తిమ్మిర్లు: మీరు ఎక్కువసేపు మడమలను ధరించినప్పుడు, మీ పాదాలలో కండరాలు సంకోచించడం ప్రారంభిస్తాయి. కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో మరింత పెరుగుతుంది.

high heels

బ్యాలెన్స్ సమస్యలు: బరువు పెరగడం, హార్మోన్ల హెచ్చుతగ్గులు మీ చీలమండలు బలహీనపడటానికి కారణమవుతాయి, దీని వలన మీ బ్యాలెన్స్ తప్పిపోతుంది. కింద పడే ప్రమాదం కూడా ఉంది. అది కడుపులో బిడ్డకు, తల్లికి క్షేమం కాదు. 

అంతేకాదు.. గర్భం దాల్చిన సమయంలో.. ఎక్కువగా పాదాలు స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో.. ఈ హీల్స్ వేసుకోవడం వల్ల.. మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందట. అందుకే.. హీల్స్ లాంటివి ధరించకపోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!