అర్జున్ కూతురికి ఎన్ని కోట్లు కట్నంగా ఇచ్చాడో తెలుసా?

First Published Jun 17, 2024, 3:37 PM IST

వీరి ప్రేమ కు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో.. చాలా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. కాగా.. ఈపెళ్లికి చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Umapathy ramaiah Aishwarya Arjun Arjun Sarja

యాక్షన్ స్టార్ అర్జున్ కి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. 90 దశకంలో స్టార్ హీరోగా  అందరినీ అలరించాడు. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు పరిచియమే. రీసెంట్ గా సినిమాలు తగ్గించారు. కానీ... అప్పట్లో ఈయన సినిమాలు చూడటానికి ప్రేక్షకులకు థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. ఆయన చేసే యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయని, ఎక్కువ మంది ఇష్టపడేవారు.

కాగా.. అర్జున్ కి ఇద్దరు కుమార్తెలు కాగా.. రీసెంట్ గా మొదటి కుమార్తె ఐశ్వర్య కి వివాహం జరిగింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు  తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ని  ప్రేమించి ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ కు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో.. చాలా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. కాగా.. ఈపెళ్లికి చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

వారిలో సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఉన్నారు. ఆయన వచ్చి.. నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. ఈ నెల 10వ తేదీన వివాహం జరగగా, 14న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ పెళ్లి తర్వాత.. కట్నం కి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.
 

దాని ప్రకారం.. అర్జున్.. తన కుమార్తెకు దాదాపు రూ.500కోట్ల కట్నం ఇచ్చారంటూ నెట్టింట న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఓ జర్నలిస్ట్ కూడా ఇదే విషయాన్ని  యూట్యూబ్ ఛానెల్ లో పేర్కొనడం గమనార్హం. అర్జున్ కి చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయట. అర్జున్‌కు చెన్నైలోని పోరూర్‌లో చాలా స్థలాలు ఉన్నాయి. ఆయనకు దాదాపు రూ. వెయ్యి కోట్ల ఆస్తులు ఉండగా.. అందులో రూ.500కోట్లు కూతురు ఐశ్వర్యకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 


 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను కూడా బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మాత్రం తెలీదు. కానీ.. అర్జున్ కి మగ పిల్లలు లేరు. ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే. 

ఇక ఆయన సంపాదనంతా..ఆ ఇద్దరు కూతుళ్లకే చెందుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూ.500కోట్ల కట్నం ఇచ్చిన విషయంలో నిజానిజాలు ఎవరికీ తెలియకపోయినా... నెటిజన్లు మాత్రం అదే నిజం అని ఫిక్స్ అవుతుండటం విశేషం.
 

Latest Videos

click me!