ముల్తానీ మట్టితో ముఖం అందంగా, కాంతివంతంగా అవుతుంది. అందుకే చాలా మంది ఈ ఫేప్ ప్యాక్ ను వేసుకుంటుంటారు. కానీ కొంతమంది ముల్తానీ మట్టిని అస్సలు పెట్టుకోకూడదు. వాళ్లు ఎవరు?దీన్ని పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మ సంరక్షణ పదార్థాల్లో ముల్తానీ మట్టి ఒకటి. దీనిలో మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఖనిజాలు, సిలికేట్లు పుష్కలంగా ఉంటాయి. ముల్తానీ మట్టిని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మంలోని అదనపు నూనె తగ్గుతుంది. అలాగే చర్మం మంచి గ్లో వస్తుంది.
27
ముల్తానీ మట్టిని ఎవరు వాడకూడదు?
ముల్తానీ మట్టి చర్మానికి ఎంతో మంచిది. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. కానీ దీన్ని కొన్ని చర్మ సమస్యలు ఉన్నవారు మాత్రం వాడకూడదు. ముఖ్యంగా ముఖం మీద గాయాలు, మొటిమలు ఉన్నవారు అస్సలు వాడకూడదు. ఒకవేళ దీన్ని అప్లై చేస్తే ఈ చర్మ సమస్యలు మరింత పెరుగుతాయి.
37
సెన్సిటివ్ చర్మం ఉన్నవారు
చర్మం సెన్సిటీవ్ గా ఉన్నవారు ముఖానికి ఏవి పడితే అవి పెట్టకూడదు. వీటిలో ముల్తానీ మట్టి కూడా ఉంది. నిపుణుల ప్రకారం.. సెన్సిటీవ్ స్కిన్ ఉన్నవారు మల్తానీ మట్టిని ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖం మీద దద్దుర్లు, చర్మం చికాకు, గాయాలు అయ్యే అవకాశం ఉంది.
చాలా మందికి పొడి చర్మం ఉంటుంది. అయితే ఈ డ్రై స్కిన్ ఉన్నవారు ముల్తానీ మట్టిని వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ముల్తానీ మట్టి మీ చర్మంలోని తేమను పీల్చుకుని చర్మాన్ని మరింత పొడి బారేలా చేస్తుంది.
57
జలుబు, దగ్గు ఉన్నవారు
దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు కూడా ముల్తానీ మట్టిని ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు గనుక ముల్తానీ మట్టిని వాడితే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
67
అలెర్జీ ఉన్నవారు
నిపుణుల ప్రకారం.. అలెర్జీ ఉన్నవారు కూడా ముల్తానీ మట్టిని ముఖానికి పెట్టకూడదు. ఎందుకంటే మంట, దురద వంటి అలెర్జీలు ఉంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మీకు ఈ అలెర్జీలు ఉంటే ముల్తానీ మట్టిన అస్సలు వాడకూడదు.
77
ఎక్కువగా వాడితే
ముల్తానీ మట్టి చర్మానికి మంచిదని, దీన్ని పెట్టుకుంటే ముఖం కాంతివంతంగా అవుతుందని చాలా మంది దీనిని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ దీనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మీ చర్మంలోని తేమను పీల్చుకుని చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది.