బాడీలోషన్, టమాటా, నిమ్మకాయ వంటివి ముఖానికి రాస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే

Published : Oct 04, 2025, 01:27 PM IST

Skin Care: మన ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ముఖానికి ఏవి పడితే అవి పెడితే మాత్రం చర్మం దెబ్బతింటుంది. స్కిన్ సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ముఖానికి వేటిని పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

PREV
15
ముఖానికి ఏం పెట్టకూడదు?

ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను కూడా ముఖానికి పూస్తుంటారు. వీటివల్ల ముఖం కాంతివంతంగా అవుతుందని, చర్మ సమస్యలు తగ్గిపోతాయని నమ్ముతారు. 

అందుకే ఎవరీ సలహా తీసుకోకుండా నేరుగా ముఖానికి పెట్టేస్తుంటారు. కానీ కొన్ని పదార్థాల వల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది. ఉన్న చర్మ సమస్యలు కాస్త ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మన ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. 

దీనివల్ల మొటిమలు, మచ్చలు తగ్గాలని మీరు సోషల్ మీడియాలో వచ్చే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మాత్రం చర్మం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖానికి వేటిని రాయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
నిమ్మరసం

నిమ్మరసంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. కానీ దీన్ని నేరుగా చర్మానికి పెట్టడం మాత్రం మంచిది కాదు. ఈ విషయం తెలియక చాలా మంది నిమ్మరసాన్ని డైరెక్ట్ గా ముఖానికి రాస్తుంటారు. కానీ నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఎక్కుగా ఉంటుంది. 

కాబట్టి దీన్ని మీరు డైరెక్ట్ గా ముఖానికి రాస్తే మంట పుడుతుంది. అలాగే స్కిన్ రెడ్ గా అవుతుంది. ముఖ్యంగా ఎండ తగిలితే సన్ బర్న్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే చికాకు, దద్దుర్లు కూడా వస్తాయి. అందుకే నిమ్మరసాన్ని నేరుగా ముఖ చర్మానికి పెట్టకూడదు.

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్ తో చర్మ రంగు మెరుగుపడుతుందని, నలుపు తొలగిపోతుందని చాలా మంది టూత్ పేస్ట్ ను చర్మానికి అప్లై చేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది మొటిమలు తగ్గుతాయని ముఖానికి టూత్ పేస్ట్ ను పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. 

ఎందుకంటే దీనిలో మెంతోల్, బేకింగ్ సోడా, ఫ్లోరైడ్ లు ఉంటాయి. దీన్ని మీరు ముఖానికి పెడితే చర్మం కాలిపోతుంది. అలాగే ఎర్రగా అవుతుంది. అంతేకాదు టూత్ పేస్ట్ ను ముఖానికి పెట్టడం వల్ల ముఖం బాగా పొడిబారుతుంది. మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే పొరపాటున కూడా ముఖానికి టూత్ పేస్ట్ ను పెట్టకూడదు.

35
చక్కెర, ఉప్పు స్క్రబ్

చక్కెర, ఉప్పు స్క్రబ్ లను చాలా మంది ఆడవారు ఫాలో అవుతుంటారు. ఎందుకంటే వీటివల్ల చర్మంపై పేరుకుపోయిన చర్మ కణాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీంతో చర్మం క్లియర్ గా, పొడిబారకుండా ఉంటుందనుకుంటారు. కానీ ఈ చక్కెర, ఉప్పు స్క్రబ్ వల్ల చర్మానికి గాయాలవుతాయి. 

ఎందుకంటే ఇవి చాలా రఫ్ గా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల ముఖానికి గాయాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే మొటిమలు మరింత పెరుగుతాయి. అలాగే ఇన్ఫెక్షన్లు వస్తాయి.అందుకే ఈ స్క్రబ్ లను అస్సలు పెట్టకూడదు.

బాడీ లోషన్

శరీరంలో ముఖం కూడా ఒక భాగం. కాబట్టి బాడీ లోషన్ ను ముఖానికి కూడా పెట్టుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. ముఖానికి రోజుకు రెండు మూడు పూటలా దీన్ని పెడుతుంటారు. కానీ బాడీ లోషన్ ను ముఖానికి మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే ఇది మందపాటి చర్మం కోసం తయారుచేయబడింది. 

ముఖ చర్మం మాత్రం సున్నితంగా ఉంటుంది. బాడీ లోషన్ ను ముఖానికి పెడితే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల ఎన్నో చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే బాడీ లోషన్ ను ముఖానికి మాత్రం ఉపయోగించకూడదు.

45
బేకింగ్ సోడా

చాలా మంది ముఖానికి బేకింగ్ సోడాను కూడా పెడుతుంటారు. దీనివల్ల చర్మం కాంతివంతంగా అవుతుందని, మొటిమలు మచ్చలు పోతాయని అనుకుంటారు. కానీ ముఖానికి బేకింగ్ సోడాను మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే దీనిని ముఖానికి వాడటం వల్ల చర్మం పీహెచ్ లెవెల్స్ దెబ్బతింటాయి. దీంతో చర్మం పొడిబారడం, మచ్చలు ఏర్పడటం, రాషెస్ వంటి చర్మ సమస్యలు వస్తాయి.

55
వేడి నూనె

వేడి వేడి నూనెను ముఖానికి పెట్టే అలవాటు మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల ముఖ చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో మొటిమలు ఏర్పడతాయి. ఇప్పటికే మొటిమలు ఉంటే సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ముఖానికి ఎప్పుడూ కూడా వేడి నూనె పెట్టకూడదు.

పెట్టాలనుకుంటే చల్లని నూనెనే పెట్టండి. అలాగే చాలా మంది బేబీ ఆయిల్ ను కూడా ముఖానికి పెడుతుంటారు. ఎందుకంటే దీనివల్ల ముఖ చర్మం సాఫ్ట్ గా అవుతుందని. కానీ బేబీ ఆయిల్ ను ముఖానికి పెట్టడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్లాక్ హెడ్స్, మొటిమలు వంటి సమస్యలు ఏర్పడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories