Skin Care: రాత్రిపూట ఏం రాస్తే.. ఉదయానికి ముఖం స్మూత్ గా మారుతుందో తెలుసా?

Published : Oct 04, 2025, 11:53 AM IST

Skin Care: వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కూడా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అంతేకాదు... చిన్న పిల్లల స్కిన్ లాగా స్మూత్ గా మార్చుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు కొన్ని సహజ పదార్థాలను ముఖానికి రాయడం వల్ల స్కిన్ మృదువుగా మార్చుకోవచ్చు

PREV
15
Skin Care

ప్రతిరోజూ అందంగా మెరిసిపోవాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసమే వేల రూపాయలు ఖర్చు చేసి మరీ క్రీములు కొనేసి.. ముఖానికి రాస్తూ ఉంటారు. కానీ.. ఎన్ని క్రీములు రాసినా కూడా ముఖం నిర్జీవంగా మారిపోయిందని.. ముఖంపై మొటిమలు, డార్క్ సర్కిల్స్ ఇలా వస్తున్నాయని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. కానీ... వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కూడా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అంతేకాదు... చిన్న పిల్లల స్కిన్ లాగా స్మూత్ గా మార్చుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు కొన్ని సహజ పదార్థాలను ముఖానికి రాయడం వల్ల స్కిన్ మృదువుగా, మెరిసిపోయేలా చేసుకోవచ్చు. మరి.. ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం....

25
1.కలబంద, కొబ్బరి నూనె...

చాలా మంది తమ స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా కలబందను ముఖానికి రాస్తూ ఉంటారు. కానీ... కేవలం కలబంద జెల్ కాకుండా.. కొబ్బరి నూనె కూడా కలిపి ముఖానికి రాయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని.. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ముఖానికి మంచిగా అప్లై చేయాలి. ఆ తర్వాత పడుకునేముందు నీటితో శుభ్రం చేసుకొని పడుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా రాయడం వల్ల చర్మానికి మంచి తేమ అందుతుంది. ఇలా రెగ్యులర్ గా రాయడం వల్ల ఉదయానికి చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఫేస్ లో ఒక తెలియని గ్లో కూడా వచ్చేస్తుంది.

35
గ్లిజరిన్, తేనె , నిమ్మకాయ

గ్లిజరిన్ చర్మాన్ని తేమ చేస్తుంది, తేనె దానిని మృదువుగా చేస్తుంది. నిమ్మకాయ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మూడు పదార్థాలను కలిపి పడుకునే ముందు ముఖం మీద అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడగాలి. మీరు దీన్ని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

రోజ్ వాటర్ , గంధపు పొడి

రోజ్ వాటర్ ముఖాన్ని చల్లబరుస్తుంది. గంధపు పొడి చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. ఇది మన చర్మానికి సహజమైన ప్రకాశవంతమైన రంగును ఇస్తుంది. ఈ రెండు పదార్థాలను పేస్ట్ లా చేసి మీ ముఖంపై అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.

45
చక్కెరతో స్క్రబ్ చేయండి

వారానికి ఒకసారి చక్కెరతో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ని ఈజీగా తొలగించొచ్చు. మీ చర్మం ప్రకాశవంతంగా కనిపించడమే కాకుండా, రోజంతా మీరు తాజాగా ఉంటారు. మీ రాత్రి చర్మ సంరక్షణ దినచర్య తర్వాత, ఉదయం కొన్ని సెకన్ల పాటు మీ ముఖాన్ని ఐస్ వాటర్‌లో ఉంచాలి. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది.

55
దోసకాయ రసం , పుదీనా ఆకులు

దోసకాయ మన ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మన చర్మానికి అంతే ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా చర్మంలోని నూనెను నియంత్రిస్తుంది. దోసకాయ, పుదీనాను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత, మీ ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories