Hair Oil: కర్పూరాన్ని నూనెలో కలిపి మన జుట్టుకు రాస్తే... అతి తక్కువ సమయంలో తలలో చుండ్రు మాయం అవుతుంది. అంతేకాదు.. తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. మరి, కర్పూరం నూనెను జుట్టుకు ఎలా వాడాలో తెలుసా?
మన జుట్టు.. మన అందాన్ని పెంచుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ.. ఒత్తుగా ఉంటే సహజంగానే అందంగా కనిపిస్తారు. కానీ, ఈ రోజుల్లో పని ఒత్తిడి , కాలుష్యం, అసమతుల్యమైన ఆహారం, కెమికల్ ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవుతోంది. సహజమైన మెరుపు, మృదుత్వం కోల్పోతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఒక చిన్న రెమిడీ వాడితే చాలు. చుండ్రు సమస్యను తగ్గించడానికి, తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి, జుట్టు అందంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. మరి, ఆ రెమిడీ ఏంటో చూద్దామా....
కర్పూరాన్ని మనం సహజంగా ఇంట్లో పూజ చేసే సమయం వాడతాం. ఇదే కర్పూరం.. చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా వాడుతూనే ఉంటారు. ఇదే కర్పూరాన్ని నూనెలో కలిపి మన జుట్టుకు రాస్తే... అతి తక్కువ సమయంలో తలలో చుండ్రు మాయం అవుతుంది. అంతేకాదు.. తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది.
25
కర్పూరం నూనె తయారీ...
మీరు మీ జుట్టుకు రాసుకోవడానికి సరిపడా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ కొబ్బరి నూనెను చిన్న ప్యాన్ లో వేసి వేడి చేయాలి. ఆ వేడి నూనెలో స్వచ్ఛమైన కర్పూరం కూడా వేసి మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఆ కొబ్బరి నూనెను చల్లార్చాలి. దీనిని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత... వారానికి రెండు,మూడుసార్లు తలకు బాగా పట్టించి.. బాగా మసాజ్ చేయాలి. నెల రోజుల పాటు ఈ నూనె రాసినా.. చుండ్రు చాలా తొందరగా తగ్గిపోతుంది.
35
కర్పూరం నూనెతో ప్రయోజనాలు...
1. జుట్టుకు మెరుపు, మృదుత్వం
కాలుష్యం, కెమికల్ ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు రఫ్‌గా, బలహీనంగా మారుతుంది. కర్పూరం నూనె జుట్టుకు సహజమైన మెరుపును, మృదుత్వాన్ని తిరిగి ఇస్తుంది.
2. చుండ్రు నివారణ
చుండ్రు సమస్యతో బాధపడేవారు కర్పూరం నూనెను నిమ్మరసంతో కలిపి తలకు పూసి 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత మృదువైన షాంపూతో కడిగితే చుండ్రు తగ్గిపోతుంది.
3. పేలు సమస్యకు పరిష్కారం
పొడవాటి జుట్టు ఉన్నవారికి పేలు సమస్య ఎక్కువగా ఉంటుంది. తలస్నానం చేయడానికి ముందు కర్పూరం నూనె రాస్తే పేలు తగ్గడమే కాకుండా తల చర్మం శుభ్రంగా ఉంటుంది.
ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతోంది. కర్పూరం నూనె జుట్టుకు పోషణ అందించి, నల్లటి రంగును నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
5. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కర్పూరం నూనెతో తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి, హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి. దీని వల్ల జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
55
కర్పూరం నూనెను ఎలా వాడాలి..?
వారంలో కనీసం 2 సార్లు తలకు ఈ కర్పూరం నూనె మసాజ్ చేయాలి. రాత్రిపూట రాసి.. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది. దీనిని క్రమం తప్పకుండా రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, దట్టంగా మారుతుంది.