Hair Growth: ఈ ఐదు నూనెలు ఎలా వాడాలో తెలిస్తే... హెయిర్ ఫాల్ ఉండదు..!

Published : Nov 19, 2025, 03:11 PM IST

Hair Growth : జుట్టు విపరీతంగా రాలిపోతుందని బాధపడుతున్నారా? అయితే, కేవలం  కొన్ని రకాల నూనెలను వాడి ఆ సమస్యను తగ్గించవచ్చని మీకు తెలుసా? ఆ నూనెలు ఏంటి? ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..

PREV
15
Hair Growth

ప్రస్తుత కాలంలో కామన్ గా అందరూ జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ జుట్టు విపరీతంగా రాలిపోతోంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కాలుష్యం, ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, హార్డ్ వాటర్, అసమతుల్యమైన ఆహారం, రసాయనాలు ఉన్న హెయిర్ ఉత్పత్తులు వాడటం ఇవన్నీ కూడా.. జుట్టు రాలడానికి కారణం అవుతాయి. ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కేవలం నూనెలు వాడితే చాలు.

25
కొబ్బరి నూనె...

కొబ్బరి నూనె జుట్టుకు అద్భుతమైన పోషణ అందిస్తుందని మన అందరికీ తెలుసు. ఇందులో ఉంటే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్లలోకి లోతుగా చేరి ప్రోటీన్ లాస్ ని తగ్గిస్తాయి. చాలా మంది జుట్టుకు హీట్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.. కలర్స్ వేస్తూ ఉంటారు. వాటి వల్ల జుట్టు చాలా డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే... కొబ్బరి నూనె వాడాలి. ఈ కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి.. జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ , యాంటీ ఆక్సిడెంట్లు కొత్త జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తాయి.

35
పొద్దు తిరుగుడు నూనె...

ఈ నూనెను చాలా మంది వంటకు వాడతారు. కానీ, జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనె చాలా తేలికగా ఉంటుంది. జుట్టు ఎండిపోయినట్లుగా ఉండి ఇబ్బంది పడేవారు... ఈ నూనె వాడితే.. జుట్టు మంచిగా తేమగా ఉంటుంది. అందంగా కనపడుతుంది. సహజంగా జుట్టుకు మెరుపు వస్తుంది. వెంట్రుకలు మందంగా కూడా కనపడతాయి.

45
బాదం నూనె...

బాదం నూనెలో ఉన్న విటమిన్ E, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టుకు బలం, ప్రకాశం ఇస్తాయి. జుట్టు చివర్లు పాడైపోతున్నాయి..జుట్టు పొడువు పెరగాలి అనుకునేవారు ఈ నూనె వాడొచ్చు. జుట్టు అందంగా కూడా కనపడుతుంది.

4.నువ్వుల నూనె...

నువ్వుల నూనె వంటకు మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు మూలాలకు మంచి పోషణ అందిస్తుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

ప్రకృతిలో వేడిగా ఉండటం వల్ల రక్త ప్రసరణను పెంచుతుంది

55
కలోంజి నూనె.. ( నల్ల జీలకర్ర నూనె)...

జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడానికి కలోంజి నూనె వాడితే సరిపోతుంది. ఈ నూనె తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది. కొత్త జుట్టు రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కలోంజి నూనెలో కొంత కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె కలిపితే ఫలితం రెట్టింపు లభిస్తుంది.

ఉత్తమ ఫలితాల కోసం ఈ నూనెలను ఎలా వాడాలి?

నూనెను ఎప్పుడూ కొద్దిగా వేడి చేసి వాడండి. వెచ్చని నూనె చర్మంలో బాగా గ్రహిస్తుంది. 5–7 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచి జుట్టు వృద్ధిని వేగవంతం చేస్తుంది. కనీసం ఒక గంట అలాగే ఉంచడం మంచిది. వారంలో రెండుసార్లు నూనె పూస్తే 6–8 వారాల్లో గమనించదగిన ఫలితాలు కనిపిస్తాయి. నూనె పూసిన తర్వాత జుట్టును గట్టిగా కట్టకండి—వెంట్రుకలు బలహీనపడే అవకాశం ఉంది.

ఫైనల్ గా....

ఆరోగ్యకరమైన, మందమైన, సిల్కీ జుట్టు పొందాలంటే సరైన నూనెలను నియమితంగా వాడడం అత్యంత ముఖ్యం. కొబ్బరి నూనె నుంచి కలోంజి నూనె వరకూ, ప్రతి నూనె జుట్టులోని వేర్వేరు సమస్యలను పరిష్కరించి జుట్టును బలంగా, అందంగా మారుస్తుంది. సహజ పద్ధతులు ఎప్పుడూ రసాయన ట్రీట్మెంట్ల కంటే ఆరోగ్యకరమైనవి.అందుకే వీటిని మీ హెయిర్ కేర్ రొటీన్‌లో చేర్చండి.

Read more Photos on
click me!

Recommended Stories