Hair Growth: ఈ చిట్టి చిట్టి ఆకులను తక్కువ చేయకండి, ఇవి తీసుకుంటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!

Published : Apr 14, 2026, 03:25 PM IST

 Hair Growth: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఎన్ని రకాల హెయిర్ ఆయిల్స్ వాడినా ప్రయోజనం లేదా? అయితే.. మీ డైట్ లో ఒక ఆకును తీసుకుంటే చాలు.. ఈ జుట్టు సమస్యలన్నీ తీరిపోయినట్లే... 

PREV
13
Hair Fall Control

ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్ లేనివాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, పని ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దీంతో... చాలా మంది ఖరీదైన హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడుతూ ఉంటారు. కానీ, అవేమీ లేకుండా.. మీ లైఫ్ స్టైల్ లో చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ముఖ్యంగా ఒక ఆకులను మీ డైట్ లో భాగం చేసుకుంటే... జుట్టు రాలడం తగ్గుతుంది. ఒత్తుగా కూడా పెరుగుతుంది.

23
జుట్టు పెరుగుదలకు మునగాకు..

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో మునగాకు కీలక పాత్ర పోషిస్తుంది. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, బయోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది. మరి, ఈ మునగాకును ఎలా తీసుకుంటే.. హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

33
మునగాకు పొడి...

మునగాకు పొడి మీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. మీకు స్మూతీ తాగే అలవాటు ఉంటే అందులో ఈ పొడి చేర్చుకోవచ్చు. లేదంటే.. ఈ పొడిని నీటిలో మరిగించి టీ లాగా తాగొచ్చు. లేదంటే ఏదైనా జ్యూస్ లో కలుపుకొని అయినా తాగొచ్చు. దీనిని సూప్ లు,సలాడ్ లు లేదా కూరగాయలపై కూడా చల్లుకొని తినవచ్చు.

మునగాకు నూనె...

మునగాకు నూనె జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.ఈ మునగాకు నూనెను కొద్దిగా వేడి చేసి 15 నిమిషాల పాటు తలకు మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నూనె రాత్రంతా ఉంచుకొని, ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది.దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు అందంగా కూడా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories