ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వచ్చేస్తోంది.ఈ సమస్య రాగానే దాదాపు అందరూ వెంటనే మార్కెట్లో దొరికే కొన్ని రకాల ఉత్పత్తులను వాడటం మొదలుపెడతారు. వాటి తో తెల్ల జుట్టును కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ.. వాటిలో ఉండే కెమికల్స్.. జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అలా డ్యామేజ్ అవ్వగుండా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు. అదెలాగో ఇప్పడు తెలుసుకుందాం...
24
హెన్నాలో ఇవి కలిపితే...
చాలా మంది తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెన్నా కూడా వాడుతూ ఉంటారు. హెన్నా రాస్తే.. జుట్టు ఎర్రగా మారుతుంది. అలా కాకుండా.. ఆ హెన్నాలో కొన్నింటిని కలిపి రాస్తే.. నల్లగా మారుతుంది. నార్మల్ గా మీరు వాడే హెన్నాలో మందార పూల పొడి, ఉసిరి పొడి, కరివేపాకు, నిమ్మ తొక్క పొడి, నిమ్మరసం, పెరుగు కలిపితే చాలు. వీటన్నింటినీ కలిపి మన జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా నెలకు రెండు,మూడు సార్లు ఈ హెన్నా మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే.. ఎక్కువ కాలం మీ జుట్టు నల్లగా మారుతుంది.
34
జుట్టు తెల్లబడటాన్ని నివారించే సహజ ఉత్పత్తులు...
100 గ్రాముల హెన్నా పౌడర్, ఒక చెంచా మందార పూల పొడి, ఒక చెంచా ఎండబెట్టి, పొడి చేసుకున్న ఉసిరికాయ పౌడర్, ఒక చెంచా కరివేపాకు పొడి, ఒక చెంచా నిమ్మ తొక్క పొడి, ఒక చెంచా మునగ నూనె, నాలుగు చుక్కల యూకలిప్టస్ ఆయిల్, సగం నిమ్మకాయ రసం, మూడు చెంచాల పెరుగు కలిపి, కొద్ది కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేసుకోండి. జుట్టుకు రంగు వేయకూడదనుకునే వారికి ఈ సహజ పదార్థాలు ఖచ్చితంగా సహాయపడతాయి.
మీ తలకు నూనె రాసుకున్న అరగంట తర్వాత, చేతి తొడుగులు ధరించి, మీ జుట్టుకు సహజ ఉత్పత్తులను అప్లై చేయండి. జుట్టు కుదుళ్ల నుంచి.. కింద వెంట్రుకల వరకు మంచిగా అప్లై చేయాలి. తెల్ల జుట్టు రాకూడదనుకునే వారు ఒక గంట పాటు తలపై ఉంచి, తర్వాత స్నానం చేయవచ్చు. నెరిసిన జుట్టు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని జుట్టుకు కనీసం 3-4 గంటలు ఉంచి.. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. కొద్ది రోజుల్లోనే మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.