Face Glow: ముఖానికి సబ్బు కాదు, ఇదొక్కటి వాడితే చాలు, ముఖం మెరిసిపోవడం ఖాయం..!

Published : Jul 23, 2025, 10:24 AM IST

మార్కెట్లో కెమికల్స్ తో నిండిన సబ్బులను వాడి స్కిన్ ని డ్యామేజ్ చేసుకోవడానికి బదులుగా... కొన్ని సహజ ఉత్పత్తులు వాడితే సరిపోతుంది

PREV
14
Face Wash

స్నానం చేయడానికి మనలో అందరూ కచ్చితంగా సబ్బు వాడతారు. మార్కెట్లో కూడా మన అవసరాలకు తగినట్లు రకరకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి నచ్చిన వాటిని వారు వాడుతూ ఉంటారు. కానీ, సబ్బుల్లోని రసాయనాలు మన చర్మం పీహెచ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ నురగ వచ్చే సబ్బులను వాడకపోవడం మంచిది. అందుకే, మార్కెట్లో కెమికల్స్ తో నిండిన సబ్బులను వాడి స్కిన్ ని డ్యామేజ్ చేసుకోవడానికి బదులుగా... కొన్ని సహజ ఉత్పత్తులు వాడితే సరిపోతుంది మరి, వేటిని వాడితే.. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వగుండా.. అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మరి, అవేంటో చూద్దామా...

24
పెసర పప్పుతో సబ్బు...

మనం మన ఇంట్లో లభించే పెసర పప్పును వాడి సబ్బు తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక పప్పు పెసర పప్పు తీసుకోవాలి. వాటిని ఎండలో ఆరబెట్టాలి. 6 గంటలు అవి బాగా ఎండిన తర్వాత మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఏదైనా కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. స్నానం చేసే సమయంలో లేదా, మీరు ఫేస్ వాష్ చేసుకొనేటప్పుడు.. ఒక స్పూన్ ఈ పొడి తీసుకోవాలి. దానిలో కొద్దిగా పచ్చి పసుపు కూడా చేర్చి, దానిని వాడితే సరిపోతుంది. ముఖాన్ని నీటితో కడుక్కొని.. ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ముఖానికి రుద్దాలి. ఇది వాడినప్పుడు సబ్బులాగా మనకు నురగ రాదు. కానీ, ముఖాన్ని చాలా బాగా శుభ్రం చేస్తుంది. మురికి తొలగిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీనిని మీరు రోజుకి రెండు సార్లు ఉపయోగిస్తే సరిపోతుంది.

34
చర్మానికి పెసర పప్పు...

పెసర పప్పు లో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. రెగ్యులర్ గా దీనిని వాడటం వల్ల మీ ముఖం మెరుస్తూ.. ప్రకాశవంతంగా కనపడుతుంది.

44
మొటిమలు , బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి:

సబ్బుకు బదులు.. ఇలా పచ్చి పెసర పప్పు వాడటం వల్ల మన స్కిన్ కి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పప్పుల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. వాటిలో ఉండే జింక్ , విటమిన్ ఎ వంటి పోషకాలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ , డార్క్ స్పాట్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇదే పిండిలో తేనె, నిమ్మరసం కూడా కలిపి ముఖానికి రాస్తే.. ముఖం మీద జిడ్డు మొత్తం పోతుంది. మొటిమల సమస్య కూడా ఉండదు. అంతేకాదు.. ఈ పిండిని రెగ్యులర్ గా ముఖానికి వాడటం వల్ల సూర్య రశ్మి నుంచి ముఖాన్ని రక్షించుకోవచ్చు. సన్ ట్యాన్ వల్ల జరిగిన డ్యామేజ్ ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. స్కిన్ అలర్జీలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యవ్వనంగా కనిపించేలా కూడా సహాయపడుతుంది. మీ వయసు తగ్గినట్లుగా కనపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories