Skin Brightening: ఈ పిండి పెట్టినా పండుగ రోజుల్లో మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

Published : Sep 18, 2025, 03:49 PM IST

Skin Brightening: దసరా, దీపావళి అంటూ పండుగలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆరోజే పార్లర్ కు వెళ్లే టైం ఉండకపోవచ్చు.  కానీ అందంగా కనిపించాలి. అయితే శెనగపిండి మిమ్మల్ని అప్పటికప్పుడే అందంగా మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది తెలుసా? 

PREV
15
శెనగపిండితో అందం

ఏ రోజు కనిపించిన కనిపించకపోయినా.. పండుగరోజు అయితే అందంగా కనిపించడం చాలా అవసరం. పండుగలు అంటే అలంకరణ. కానీ ఈ పండుగ సీజన్లలో పార్లర్ లు ఫుల్ బిజీగా ఉంటాయి. అయితే మీరు ఇంట్లోనే పార్లర్ లాంటి అందాన్ని పొంచొచ్చు. అదికూడా శెనగపిండి ఫేస్ ప్యాక్ తో. మరి దీనిని ముఖానికి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

25
చనిపోయిన చర్మ కణాలు

అందాన్ని మెరుగుపర్చుకోవడానికి ఎన్నో ఏండ్ల నుంచి శెనగపిండిని ఉపయోగిస్తున్నారు.శెనగపిండిలో మన చర్మాన్ని శుభ్రపరిచే గుణాలుంటాయి. ఇది చర్మంమీదున్న చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది ముఖంమీదున్న నల్ల మచ్చలను తగ్గించి నేచురల్ గ్లోను పెంచుతుంది. ఇందుకోసం శెనగపిండిలో పసుపు, పాలు, లేదా తేనెను కలిపి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. 

35
నల్ల మచ్చలు, మొటిమలు మాయం

మీకు మొటిమలు, నల్ల మచ్చలు ఉంటే గనుక శెనగపిండి ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ నల్ల మచ్చలను, మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిని వాడితే ఎండవల్ల చర్మం నల్లబడటం తగ్గుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా అవుతుంది. 

45
చర్మం ప్రకాశాన్ని పెంచుతుంది

శెనగపిండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. దీనిని వాడితే చర్మం మరింత తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. శెనగపిండి చర్మంలోని అదనపు నూనె గ్రహించి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. 

55
మృత కణాలను తొలగిస్తుంది

శెనగపిండి మంచి ఎక్స్ఫోలియేటింగ్ గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. అలాగే శెనగపిండి మన చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. దీంతో చర్మంపై ఉన్న మురికి, అదనపు నూనెలో తొలగిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories